Ram Charan : RRRలో రామ్ చరణ్ ఫేవరెట్ సీన్ ఇదే.. రివీల్ చేసిన మెగా పవర్ స్టార్

-

మాస్టర్ స్టోరి టెల్లర్ రాజమౌళి తెరకెక్కించిన విజ్యువల్ వండర్ ‘ఆర్ఆర్ఆర్’ అరుదైన రికార్డ్స్ క్రియేట్ చేస్తోంది. త్వరలో ఈ చిత్రం రూ.1,000 కోట్ల క్లబ్ లోకి చేరనుందని సినీ అభిమానులు అంటున్నారు. ఇక ఈ చిత్రంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్, యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ కలిసి నటించారు. ముఖ్యంగా రామ్ చరణ్ పాత్రలో భిన్నమైన వేరియేషన్స్, లేయర్స్ ఉన్నాయి.

ఈ క్రమంలోనే రామ్ చరణ్ పర్ఫార్మెన్స్ పట్ల సినీ లవర్స్, మెగా అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. రామ్ చరణ్ ఈ ఫిల్మ్ లో మరోసారి తన నట విశ్వరూపం చూపించారని మెగా అభిమానులు తమ చొక్కా కాలర్స్ ఎగరేస్తున్నారు.

పవర్ ఫుల్ అండ్ రూత్ లెస్ పోలీస్ ఆఫీసర్ గా, అల్లూరి సీతా రామ రాజుగా, మరదలికి ఇచ్చిన మాట నిలబెట్టుకున్న బావగా రామ్ చరణ్ పాత్రలో చాలా వేరియేషన్స్ ఉన్నాయని సంబురపడుతున్నారు. ఈ సంగతులు పక్కనబెడితే రామ్ చరణ్ తనకు RRR సినిమాలో నచ్చిన సీన్ గురించి చెప్పారు.

ఇన్ స్టా గ్రామ్ వేదికగా ఇందుకు సంబంధించిన పోస్టు పెట్టాడు. తనకు అత్యంత ఫేవరెట్ ఎపిసోడ్స్ లో ఇది ఒకటి అంటూ రాజమౌళితో దిగిన ఫొటో షేర్ చేశాడు. ఆ సీన్ రామ్ చరణ్ ఇంట్రడక్షన్ సీన్ కాగా, ఆ సీన్ థియేటర్ లో చూస్తే గూస్ బంప్స్ వస్తాయని మెగా అభిమనులు అంటున్నారు. ఆ ఎపిసోడ్ చిత్రీకరణ స్టిల్ ను మెగా పవర్ స్టార్ షేర్ చేయగా, అది చూసి నెటిజన్లు ‘టూ లెజెండ్స్, జై చరణన్న, మెగా కాంబో’ అని కామెంట్స్ చేస్తున్నారు.

https://www.instagram.com/p/CcAX8pXBlh0/?utm_source=ig_embed&ig_rid=f285eefe-1d22-4d31-97f1-7e3f48d253c3

Read more RELATED
Recommended to you

Latest news