ఈ మధ్యనే విడుదలైన బ్రో సినిమాలో అంబటి రాంబాబు ను ఉద్దేశించి కావాలంటే ఒక సాంగ్ లో అతని లాగానే డ్యాన్స్ చేయించారని వివాదం నెలకొన్న సంగతి తెలిసిందే. ఈ వివాదంపై అంబటి రాంబాబుకు మరియు జనసేనకు మధ్యన విమర్శ ప్రతివిమర్శలు దాడి జరుగుతోంది. ఇందుకు కౌంటర్ గా అంబటి రాంబాబు తాజాగా ఒక కొత్త కామెంట్ తో ముందుకు వచ్చాడు. అంబటి రాంబాబు మాట్లాడుతూ తొందరలోనే మేము ఒక సినిమాను తీస్తున్నాము అంటూ సంచలన ప్రకటన చేశాడు. సినిమా కథ విషయానికి వస్తే , “ఒక వ్యక్తి పెళ్లి చేసుకోవడం, భార్యకు విడాకులు ఇవ్వడం , అదే సమయంలో మరొకరితో సంబంధాన్ని ఏర్పరుచుకోవడం వంటి అంశాలను ఆధారంగా చేసుకుని తెరకెక్కిస్తున్నట్లు తెలిపారు అంబటి.