హీరో నాని వ్యాఖ్యలకు మంత్రి బొత్స కౌంటర్..ఇక్కడ ఎక్కువ డబ్బులు చేస్తే కుదరదు !

సినిమా టికెట్ల విషయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పై టాలీవుడ్ హీరో నాని చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు పెద్ద దుమారాన్ని రేపుతున్నాయి. ఆయన వ్యాఖ్యలకు తాజాగా ఆంధ్రప్రదేశ్ మంత్రి బొత్స సత్యనారాయణ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. సినిమా టికెట్ల ధరలను నియంత్రిస్తే అవమా నించడమా ? అని ప్రశ్నించారు. మేమింతే… ఎంత అంటే అంత వసూలు చేస్తాం.. అంటే కుదరదు అంటూ ఫైర్ అయ్యారు బొత్స సత్యనారాయణ.

సినిమా సామాన్యులకు అందుబాటులో ఉండాలి అందుకే ధరలు తగ్గించమని కుండబద్దలు కొట్టారు బొత్స సత్యనారాయణ. ఏదైనా ఇబ్బంది ఉంటే జిల్లా అధికారులను ఆశ్రయించాలని పేర్కొన్నారు. తమకు ఇబ్బందులు ఉన్నాయని చెబితే అప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆలోచిస్తోందని బొత్స సత్యనారాయణ క్లారిటీ ఇచ్చారు. మార్కెట్ లో ఏదైనా ఉంటే దానికి ఎమ్మార్పీ ఉంటుంది కదా ? ప్రేక్షకులను మేమెందుకు అవమానిస్తావా అని నాని కి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. అన్నీ తెలుసుకొని మాట్లాడాలని నాని కి చురకలు అంటించారు.