వైసీపీలో వర్గపోరు.. స్పందించిన మంత్రి బొత్స

-

వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఆవిర్భవించి 12 సంవత్సరాలు పూర్తి చేసుకున్న నేపథ్యంలో ప్లీనరీ సమావేశాలు జరుగుతున్నాయి. ఈ క్రమంలోనే విజయనగరంలో నిర్వహించిన ప్లీనరీ సమావేశాలకు మంత్రి బొత్స సత్యనారాయణ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కార్యకర్తల్లో, నాయకుల్లో మనస్పర్థలు ఉంటే చర్చించుకుందాం. పరిష్కరించుకుందాం. అంతే తప్ప అభిప్రాయ భేదాలతో పార్టీని నాశనం చేయొద్దు. అధికారంలో ఉన్నా, లేకున్నా మాకేమీ కాదు. గ్రామస్థాయిలో, మండల స్థాయిలో మీకే ఎక్కువ ఇబ్బందులు ఉంటాయన్న సంగతి గుర్తు పెట్టుకోండి అని ఆయన వ్యాఖ్యానించారు. వైసీపీ నాయకులు, కార్యకర్తల్లో రెండో ఆలోచన మొదలైందని సంచలన వ్యాఖ్యలు చేసిన బొత్స.. పక్క చూపులు చూడొద్దన్నారు.

Andhra Pradesh: Capital shifting at any moment, stresses Botsa Satyanarayana

ఒకవేళ అదే నిజమైతే అందరం నష్టపోక తప్పదని హెచ్చరించారు మంత్రి బొత్స. ముఖ్యమంత్రి పనితీరు బాగుందని అందరూ చెబుతున్నారని, దానిని మనం నిలబెట్టుకోవాలని సూచించారు మంత్రి బొత్స. పార్టీలో నెలకొన్న అభిప్రాయ భేదాలను పరిష్కరించుకుని పార్టీని మరింత ముందుకు తీసుకెళ్లాలన్నారు మంత్రి బొత్స. ప్రతి వంద రోజులకు ఒకసారి జిల్లా స్థాయి
సమావేశాలు నిర్వహిస్తే కార్యకర్తల కడుపులో ఉన్నవి బయటకు వస్తాయని, వారి సమస్యలను జిల్లా సమావేశం దృష్టికి తీసుకొస్తే లోటుపాట్లను సరిదిద్దుకుంటామని పేర్కొన్నారు మంత్రి బొత్స.

 

Read more RELATED
Recommended to you

Latest news