ఇవాళ రెండో రోజు అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కాగా…కడప ఉక్కకర్మాగారంపై అచ్చెన్న వేసిన ప్రశ్నపై చర్చ జరిగింది. ఈ నేపథ్యంలోనే.. కడప స్టీల్ ప్లాంట్ విషయంలో మంత్రి బుగ్గన కీలక వ్యాఖ్యలు చేశారు. కడప స్టీల్ ప్లాంట్ అంశంపై విభజన చట్టంలో ఉన్న అంశాలను విశదీకరించిన బుగ్గన… కడప స్టీల్ పెట్టేందుకు ఆలోచించొచ్చనే విభజన చట్టంలో ఉందని చెప్పారు.
స్టీల్ ప్లాంట్ విషయమై విభజన చట్టంలో ఏముందో సరిగా చూడండని… కడపలో స్టీల్ ప్లాంట్ కోసం ప్రయత్నం చెయ్యొచ్చని అని మాత్రమే చట్టంలో ఉందని వెల్లడించారు. కడప స్టీల్ ప్లాంట్ అంశమై విభజన చట్టంలో MAY BE అని మాత్రమే ఉంది SHALL అని లేదు… కోవిడ్ వల్ల ప్రపంచ వ్యాప్తంగా స్టీల్ ఇండస్ట్రీ బాగా దెబ్బతిన్నదని వివరించారు. కడప స్టీల్ ప్లాంట్ ఏర్పాటుకు భాగస్వామ్యం కోసం వెతుకుతున్నామన్నారు. స్టీల్ ప్లాంట్ ల్యాండుకు సంబందించి రూ. 37.50 కోట్లు పరిహరం చెల్లించామని చెప్పారు.