తెలంగాణ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా దళిత బంధు పథకాన్ని ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. అయితే.. సీఎం కేసీఆర్ దళితుల అభివృద్ధి కోసం చేపట్టిన దళిత బంధు పథకాన్ని సద్వినియోగం చేసుకొని ఆర్థికంగా అభివృద్ధి చెందాలని పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. పాలకుర్తి నియోజకవర్గంలోని జకొడకండ్ల, పెద్ద వంగర మండల కేంద్రాల్లో ఆయా మండలాల దళిత, పార్టీ నేతలు, ప్రజా ప్రతినిధులతో మంత్రి వేర్వేరుగా సమావేశాలు నిర్వహించారు మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. లబ్ధిదారులు లాభకరమైన యూనిట్లను ఎంపిక చేసుకోవాలని ఆయన సూచించారు.
లబ్ధిదారుల ఎంపిక, శిక్షణ, లబ్ధిదారునికి సరైన అవగాహన కల్పించడం వంటి అంశాలపై అధికారులు శ్రద్ధ తీసుకోవాలని మంత్రి అధికారులను ఆదేశించారు మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు. రాష్ట్రంలో ప్రతి దళిత కుటుంబానికి ఆర్థికంగా అభివృద్ధి చేయాలనే సంకల్పంతో రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాలలో ఈ పథకాన్ని అమలు చేస్తున్నామని తెలిపారు మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు. సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన దళిత బంధు పథకం దేశానికే దిక్సూచి అని మంత్రి తెలిపారు. ఇలాంటి పథకం దేశంలోనే ఎక్కడా లేదన్నారు మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు.