బీజేపీకి షాక్..ఈటల రాజేందర్ సభ్యత్వం పై వేటు ?

-

 

 

నిన్న తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమైన సంగతి తెలిసిందే. అసెంబ్లీ సమావేశాలు చాలా తక్కువ రోజులు నిర్వహిస్తున్నారని.. కెసిఆర్ తను సన్నల్లో స్పీకర్ పోచారం వ్యవహరిస్తున్నారని ఈటల రాజేందర్ అనుచిత వ్యాఖ్యలు చేశారు. అయితే స్పీకర్ పోచారంపై ఈటల చేసిన వ్యాఖ్యలకు వేముల ప్రశాంత రెడ్డి కౌంటర్. స్పీకర్ పోచారం గారిపై ఈటెల రాజేందర్ అనుచిత వ్యాఖ్యలు దుర్మార్గం అని నిప్పులు చెరిగారు.

సీనియర్ సభ్యుడిని అని చెప్పుకుంటూ… సభాపతిని మరమనిషి అని కించపరుస్తూ మాట్లాడారన్నారు. సభ ఎన్ని రోజులు అనేది బిఎసి లో చర్చించాకే నిర్ణయం తీసుకున్నాం…సీఎం కేసిఆర్ చెప్పినట్లు స్పీకర్ వింటున్నాడని చైర్ ను అగౌరవ పరుస్తూ మాట్లాడడం ఆయన అహంకారానికి నిదర్శనమని మండిపడ్డారు.

బేశరతుగా ఈటెల రాజేందర్ స్పీకర్ కి క్షమాపణ చెప్పాలి…లేకుంటే నిబంధనల ప్రకారం చర్యలపై ముందుకెళ్తామని వార్నింగ్ ఇచ్చారు శాసన సభ వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి. అయితే వేముల ప్రశాంత రెడ్డి వ్యాఖ్యలు చూస్తుంటే…ఈటెల రాజేందర్ సభ్యత్వం పై వేటు వేసేందుకు స్పీకర్ పోచారం నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇదే విషయాన్ని రాజకీయ విశ్లేషకులు కూడా చెబుతున్నారు. దీనిపై ఇవాళ క్లారిటీ రానుంది.

Read more RELATED
Recommended to you

Latest news