వైసీపీ నేతలపై మంత్రి గంగుల సంచలన వ్యాఖ్యలు

-

ఇటీవల వైసిపి సర్కారుపై తెలంగాణ మంత్రి హరీష్ రావు చేసిన వ్యాఖ్యలతో టిఆర్ఎస్ – వైసిపి నేతల మధ్య మాటల యుద్ధం తారస్థాయికి చేరింది. వైసిపి సర్కారు ఉపాధ్యాయులపై కేసులు పెట్టి జైల్లో వేస్తోందని మంత్రి హరీష్ రావు చేసిన వ్యాఖ్యలతో వైసిపి కీలక నేతలు టిఆర్ఎస్ ప్రభుత్వం పై, మంత్రి హరీష్ రావు పై విమర్శలు గుప్పించారు. ఇక ఏపీ ప్రభుత్వ ముఖ్య సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి కీలక వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే.

అయితే సజ్జల వ్యాఖ్యలపై తెలంగాణ మంత్రి గంగుల కమలాకర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. మాతో పెట్టుకుంటే 2014లో ఎలా ఉద్యమం చేశామో మర్చిపోయారా? అని ఘాటు వ్యాఖ్యలు చేశారు. మళ్లీ తమతో ఎందుకు గోక్కుంటున్నారు అని ప్రశ్నించారు. మళ్లీ 2014 వంటి ఘటన పునరావృతం చేయాలా? అన్నారు గంగుల. జగన్ బిజెపికి బీ టీం గా వ్యవహరిస్తున్నారని అన్నారు.

పచ్చని కుటుంబాలను విడదీయడంలో సజ్జల రామకృష్ణారెడ్డి సిద్ధహస్తుడని ఆరోపించారు. తల్లినీ కొడుకుని విడదీసినన సజ్జల, అన్నను, చెల్లిని కూడా విడదీశారని ఆరోపించారు. వైయస్సార్ కుటుంబాన్ని విచ్ఛిన్నం చేసిన సజ్జల.. ఇప్పుడు కేసీఆర్ కుటుంబాన్ని విడదీయడానికి ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు.

Read more RELATED
Recommended to you

Latest news