కామారెడ్డి జిల్లా బిచ్ కుందలో డయాలసిస్ సెంటర్ ని ప్రారంభించిన మంత్రి హరీష్ రావు

-

కామారెడ్డి జిల్లా బిచ్ కుందలో డయాలిసిస్ సెంటర్ ని ప్రారంభించారు మంత్రి హరీష్ రావు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కిడ్నీ సమస్యలు ఉన్న వారు వారానికి రెండు మూడు సార్లు డయాలసిస్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుందన్నారు. పేద వారికి ఇది ఎంతో ఖర్చుతో కూడుకున్న వ్యవహారం అన్నారు.

తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు ముందు కేవలం ఉస్మానియా, గాంధీ, నిమ్స్ ఆసుపత్రిలో మాత్రమే ఇవి ఉండేవని.. ఆదిలాబాద్ నుంచి మహబూబ్ నగర్ నుంచి..ఖమ్మం నుంచి ఇలా దూర ప్రాంతాల నుంచి ప్రయాణం చేయాల్సి వచ్చేదన్నారు. ఈ సమస్యకు పరిష్కారంగా.. డయాలసిస్ కేంద్రాల సంఖ్యను తెలంగాణ ప్రభుత్వం 3 నుంచి 83 కు పెంచిందన్నారు మంత్రి హరీష్ రావు. అంతేకాక వీటిని 102 కు పెంచాలని లక్ష్యంతో ఉందన్నారు.

వీటి కోసం యుద్ధ ప్రాతిపాదికన వీటిని ఏర్పాటు చేస్తుందన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా గా ఆరోగ్యశ్రీ ద్వారా సింగిల్ యూజుడ్ ఫిల్టర్ ను ఉపయోగించి డయాలసిస్ చేస్తున్నామని తెలిపారు. ఒకరి నుండి మరొకరికి ఇన్ఫెక్షన్ రాకుండా ఉండాలని ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందన్నారు. డయాలసిస్‌ రోగులకు ఆసరా పింఛను, ఉచిత బస్‌ పాస్‌కూడా ఇస్తున్నమని తెలిపారు. ఏటా 150 వరకు కిడ్నీ ట్రాన్స్‌ప్లాంటేషన్‌లు జరుగుతున్నాయన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news