శ్రీవారిని దర్శించుకున్న మంత్రి హరీష్‌రావు..

-

తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి వారిని తెలంగాణ రాష్ట్ర ఆర్థిక, వైద్యారోగ్య శాఖ మంత్రి హరీష్ రావు దర్శించుకున్నారు. ఇవాళ‌ తన పుట్టిన రోజు సందర్భంగా స్వామి వారిని దర్శించుకొని, మొక్కులు చెల్లించుకున్నారు. నిన్న రాత్రి కాలినడకన మంత్రి హరీష్‌రావు తిరుమల‌కు చేరుకున్నారు. ఆయనకు టీటీడీ అధికారులు ఘన స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. ఇవాళ ఉదయం ఆయన వీఐపీ విరామ సమయంలో స్వామి వారిని దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనానంతరం ఆలయ రంగనాయకుల మండపంలో మంత్రి హరీష్ రావుకు వేదపండితులు ఆశీర్వచనం అందించగా, టీటీడీ ఆలయ అధికారులు స్వామివారి తీర్ధప్రసాదాలను, పట్టువస్త్రాలను అందజేశారు.

తిరుమ‌ల శ్రీవారిని దర్శించుకున్న మంత్రి హరీష్ రావు

అనంతరం మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ.. నేటితో తను 50వ ఏట అడుగుపెడుతున్న సందర్భంగా స్వామి వారి ఆశీస్సులు పొందడానికి తిరుమ‌ల వచ్చినట్లు వెల్లడించారు. అయితే.. ఈ నేపథ్యంలో.. ట్విట్టర్‌ వేదికగా ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత.. హరీష్‌రావుకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. జ‌న్మ‌దిన శుభాకాంక్ష‌లు బావ‌.. ఆయురారోగ్యాల‌తో, నిండు నూరేళ్లు జీవించాల‌ని కోరుకుంటున్న‌ట్టు క‌విత త‌న ట్వీట్‌లో పేర్కొన్నారు. ఇదిలా ఉంటే.. హ‌రీశ్‌రావు అభిమానులు ప‌లు సేవా కార్య‌క్ర‌మాలు చేప‌ట్టారు. త‌న జ‌న్మ‌దినం సంద‌ర్భంగా తనపై ఉన్న ప్రేమను ప్రజ‌లకు ఉప‌యో‌గ‌పడే సేవా కార్య‌క్ర‌మాల ద్వారా చాటా‌లని అభి‌మా‌నులు, కార్య‌క‌ర్త‌లకు హ‌రీశ్‌రావు సూచించిన సంగ‌తి తెలిసిందే.

Read more RELATED
Recommended to you

Latest news