Major Twitter review : “మేజర్” ట్విటర్ రివ్యూ

-

విభిన్న కథలను ఎంచుకుంటూ టాలీవుడ్ లో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న హీరో అడవి శేషు. క్షణం, గూడచారి, ఎవరు సినిమాలతో మంచి విజయాలను అందుకున్న అడవిశేష్ ఇప్పుడు “మేజర్” గా ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసుకుని ఇవాళ విడుదల అయింది. మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ జీవిత చరిత్ర ఆధారంగా ఈ సినిమాను రూపొందించారు.

” గూడచారి” ఫెమ్ శశికిరణ్ తిక్క ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు.తెలుగు, హిందీ భాషల్లో ఒకేసారి చిత్రీకరించిన ఈ చిత్రాన్ని పాన్ ఇండియా స్థాయి లో విడుదల అయింది. ఈ మేజర్ మూవీ విషయానికి వస్తే… చాలా బాగుంది అని సోషల్ మీడియాలో ట్వీట్లు చేస్తున్నారు. మేజర్ అంటే సినిమా కాదని.. ఎమోషన్… మేజర్ సినిమా క్లైమాక్స్ చూస్తున్న ప్రతి ప్రేక్షకుడి కంట కన్నీరు వచ్చిందని.. అడవి శేషు అద్భుతం గా నటించగా… డైరెక్టర్ శశికిరణ్ తిక్క దర్శకత్వం బాగుంది అని కామెంట్స్ చేస్తున్నారు.

 

Read more RELATED
Recommended to you

Latest news