1956లో ఆంధ్రప్రదేశ్ కు తెలంగాణ తో ఇష్టం లేని పెళ్లి చేశారని మంత్రి కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. సిరిసిల్లలో తెలంగాణ జాతీయ సమైక్యత వజ్రోత్సవాల వేడుకల్లో పాల్గొన్న మంత్రి కేటీఆర్ ఆసక్తికర కామెంట్స్ చేశారు. తెలంగాణ ప్రజలు ఉద్యమాలు పోరాటాలు చేసి తెలంగాణ సాధించుకున్నారని.. రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ ఆర్టికల్ మూడు లేకపోతే తెలంగాణ ఏర్పడేది కాదని తెలిపారు.
అందుకే అంబేడ్కర్ పేరు సీఎం కేసీఆర్ రాష్ట్ర సచివాలయానికి పెట్టారని.. ఎనిమిదేళ్ల లో లేనిది కొత్తగా కులం మతం అంటూ చిచ్చు పెడుతున్నారన్నారు. వైషమ్యాలు పెంచుతున్నారని..హిందువులు ముస్లింలు అంటూ కుట్రలు చేస్తున్నారని నిప్పులు చెరిగారు.
ఎనిమిదేళ్లలో కేంద్రానికి గుర్తుకు రాని సెప్టెంబర్ 17 ఇప్పుడు గుర్తుకు వచ్చిందా… అమిత్ షా వస్తున్నారు.. తెలంగాణ కు ఏమైనా నిధులు తెస్తారా మరి.. తేరు.. ఊకదంపుడు అంటూ ఫైర్ అయ్యారు. మెగా పవర్ లూమ్ క్లస్టర్ కోసం ఎనిమిది ఏళ్ల నుంచి కాకి లెక్క మొత్తుకుంటున్నా… అవి చేయరు.. ఓ కాలేజీ తేరని నిప్పులు చెరిగారు. హిందూ ముస్లింలు పాత గొడవలు పాత విషయాలు తగ్గుకోవాలి అని బీజేపీ వాళ్లు అంటున్నారు…అందరూ కలిసి ఉండాలని మేము అంటున్నాన్నారు.
Minister @KTRTRS addressing the gathering at the 'Telangana Jateeya Samaikyatha Vajrotsavaalu' being organised in Rajanna Sircilla District. https://t.co/stYKmEsjst
— Minister for IT, Industries, MA & UD, Telangana (@MinisterKTR) September 16, 2022