హైదరాబాద్: బాలానగర్‌లో ఎన్నాళ్ల నుంచో ఉన్న ట్రాఫిక్ కష్టాలు నేటితో తీరనున్నాయి. నిరంతరం గంటల కొద్దీ పడుతున్న వాహనదారుల ఇబ్బందులకు కాసేపట్లో చరమగీతం పాడనున్నారు. బాలానగర్ డివిజిన్ నర్సాపూర్ చౌరస్తా వాహనాలతో ఎప్పుడు రద్దీగా ఉంటుంది. కూకట్‌పల్లి, సికింద్రాబాద్, జీడిమెట్ల వెళ్లే దారిలో భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యేది. ఇప్పుడు ఈ ప్రాంతంలో కొత్త ఫ్లై ఓవర్ బ్రిడ్జి అందుబాటులోకి వచ్చింది. నేడు మంత్రి కేటీఆర్ ఈ ఫ్లై ఓవర్ బ్రిడ్జిని ప్రజలకు అంకితం చేయనున్నారు.
వాహనదారులకు గుడ్ న్యూస్.. కాసేపట్లో బాలానగర్ ఫ్లై ఓవర్ బ్రిడ్జిను ప్రారంభించనున్న కేటీఆర్
-