ఆశించిన ఫలితం రాలేదు:కేటీఆర్…!

దుబ్బాక ఉప ఎన్నిక ఫలితంపై సమీక్షించుకుంటామన్నారు టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మంత్రి కేటీఆర్.దుబ్బాక ఉప ఎన్నిక ఫలితం అనంతరం కేటీఆర్ మీడియాతో మాట్లాడారు. విజయాలకు పొంగిపోము.. అపజయాలకు కుంగిపోము అన్నారు. దుబ్బాకలో ఖచ్చితంగా గెలుస్తామనుకున్నామని కాని ఆశించిన ఫలితం దక్కలేదన్నారు.

దుబ్బాక ఉప ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌కు ఓటేసిన ప్రజలకు ధన్యవాదాలు చెప్పారు. ఆరున్నరేళ్లలో టీఆర్ఎస్ ఎన్నో విజయాలు నమోదు చేసుకుందని గుర్తుచేశారు. రాజకీయాల్లో గెలవాలన్న ఆకాంక్షతోనే పోటి చేస్తామన్నారు.దుబ్బాక తీర్పును లోతుగా సమీక్షించుకుంటామని కేటీఆర్ వెల్లడించారు.దుబ్బాకలో టీఆర్ఎస్ పార్టీ అభ్య‌ర్థి సోలిపేట సుజాత‌పై 10 ఓట్ల మెజార్టీతో బీజేపీ అభ్య‌ర్థి ర‌ఘునంద‌న్ రావు గెలుపొందారు.బీజేపీకి టీఆర్ఎస్ గ‌ట్టి పోటీనిచ్చింది. రెండో స్థానంలో టీఆర్ఎస్, మూడో స్థానంలో కాంగ్రెస్ పార్టీ నిలిచింది.