కామారెడ్డి జిల్లా కలెక్టర్ కు అండగా నిలిచిన మంత్రి కేటీఆర్

-

కామారెడ్డి జిల్లా కలెక్టర్ ఎపిసోడ్‌ పై మంత్రి కేటీఆర్‌ తన స్టైల్‌ లో స్పందించారు. కామారెడ్డి జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ కు బాసటగా నిలిచిన మంత్రి కేటీఆర్.. కేంద్రం పై ఫైర్‌ అయ్యారు. కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్, కలెక్టర్ కి మధ్య జరిగిన సంభాషణలో కలెక్టర్ కి ట్విట్టర్ వేదిక ద్వారా మద్దతుగా నిలిచిన కేటీఆర్… జిల్లా కలెక్టర్‌తో కేంద్ర మంత్రి నిర్మల సీతారామన్ ప్రవర్తన నన్ను భయపెట్టిందని ఎద్దేవా చేశారు.

రాజకీయ నాయకులూ కష్టపడి పనిచేసే ఆల్ ఇండియా సర్వీసెస్ అధికారులను నిరుత్సాహపరుస్తారని ఆగ్రహించారు. కలెక్టర్ జితేష్ వి పాటిల్, గౌరవప్రదమైన ప్రవర్తనకు నా అభినందనలు అంటూ ట్విట్టర్ లో మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. కాగా… కామారెడ్డి జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ పై నిన్న కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ సీరియస్‌ అయిన సంగతి తెలిసిందే. రేషన్‌ లో కేంద్ర వాటా చెప్పాలని నిర్మలా.. కామారెడ్డి కలెక్టర్‌ ను ప్రశ్నించారు. అలాగే… మోడీ ఫ్లెక్సీలను రేషన్‌ షాపుల వద్ద కట్టాలని ఆదేశించారు.

Read more RELATED
Recommended to you

Latest news