నేడు ప్రాన్స్‌ పర్యటనకు మంత్రి కేటీఆర్‌

తెలంగాణ రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి వర్యులు కల్వకుంట్ల తారక రామారావు… మరో విదేవీ టూర్‌ కు రెడీ అయ్యారు. నేడు ప్రాన్స్‌ పర్యటనకు వెళ్లనున్నారు తెలంగాణ రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్‌. ఫ్రాన్స్ రాజధాని పారిస్ లో జరగనున్న పలు అధికారిక కార్యక్రమాల్లో పాల్గొనేందుకు మంత్రి కేటీఆర్ నేతృత్వంలో పయనం కానుంది తెలంగాణ ప్రతినిధి బృందం.

ఫ్రెంచ్ సెనేట్ లో జరిగే యాంబిషన్ ఇండియా 2021 కార్యక్రమంలో ఈ నెల 29న కీలక ఉప న్యాసం చేయనున్నారు మంత్రి కేటీఆర్. అలాగే.. తెలంగాణ రాష్ట్రంలో పెట్టుబడులు, హైదరాబాద్‌ ప్రాముఖ్యత గురించి ఈ సమావేశం మంత్రి కేటీఆర్‌ ప్రస్తావించనున్నారని తెలుస్తోంది.

తెలంగాణ రాష్ట్రానికి పెట్టుబుడులు వచ్చేలా కేటీఆర్‌ ఉప న్యాసం సాగనున్నట్లు సమాచారం. అనంతరం పలువురు ఫ్రెంచ్ పారిశ్రామిక వేత్తలు, సీఈవో లతో ఈ సందర్భంగా సమావేశం కానున్నారు మంత్రి కేటీఆర్. మంత్రి కేటీఆర్‌ తో పాటు ప్రతినిధి బృందం లో ఐటి, పరి శ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి శ్రీ జయేష్ రంజాన్, ఇతర ఉన్నతాధికారులు పాల్గొనున్నారు.