ముందస్తు ఎన్నికలపై మంత్రి కేటీఆర్ కీలక ప్రకటన చేశారు. తుక్కగూడ సభలో అమిత్ షా వ్యాఖ్యలకు మంత్రి కేటీఆర్ కౌంటర్ ఇస్తూ.. ముందస్తు ఎన్నికల ప్రస్తావన తెచ్చారు. దమ్ముంటే.. ముందస్తు ఎన్నికలకు వెళదామని పేర్కొన్నారు. లోక్ సభను రద్దు చేయండి.. దేశ వ్యాప్తంగా ఒకే సారి ఎన్నికలు నిర్వహించండి.. మేం సిద్ధంగా ఉన్నామని ఛాలెంజ్ చేశారు మంత్రి కేటీఆర్.
అధికారం తంబాకు, లవంగం కాదు ప్లీజ్ ప్లీజ్ అంటే ఇవ్వడానికి అని ఆయన మండిపడ్డారు మంత్రి కేటీఆర్.. బీజేపీ స్టీరింగ్ కార్పొరేట్ల చేతుల్లో ఉందని, కాంగ్రెస్ దద్దమ్మ పార్టీ.. పటేల్ బొమ్మను బీజేపీ ఎత్తుకు పోయిందని ఆయన వ్యాఖ్యానించారు. నీళ్ల వాటా ఎనిమిదేళ్ళలో ఎందుకు పరిష్కరించ లేదని, 811 టీఎంసీల నీటిలో తెలంగాణ వాటా తేల్చు అని ఆయన అన్నారు. తెలంగాణకు సెల్యూట్ కొట్టు… నియామకాల విషయంలో ఫైల్ కేంద్రం దగ్గర పెట్టుకుని నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని ఆయన ఫైర్ అయ్యారు మంత్రి కేటీఆర్.