Breaking : ఐటీ సోదాలపై కీలక వ్యాఖ్యలు చేసిన మంత్రి మల్లారెడ్డి

-

తెలంగాణలో కేంద్ర దర్యాప్తు సంస్థలు దాడులు రాష్ట్ర రాజకీయాల్లో హీట్‌ పెంచుతున్నాయి. అయితే.. ఇటీవల మంత్రి మల్లారెడ్డి నివాసంతో పాటు సన్నిహితుల ఇళ్లలోనూ ఐటీ అధికారులు రెండున్నర రోజుల పాటు సోదాలు నిర్వహించారు. సిద్దిపేట జిల్లా ములుగు మండలం ఆర్ అండ్ ఆర్ కాలనీ బహిలంపూర్లో ఉచిత మినరల్ వాటర్ ప్లాంట్ను ప్రారంభించారు మంత్రి మల్లారెడ్డి. అయితే.. తాజాగా మంత్రి మల్లారెడ్డి మాట్లాడుతూ ఐటీ రైడ్స్‌పై కీలక వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడ్డాక దేశంలో ఐటీ రైడ్స్ ఉండవని మంత్రి మల్లారెడ్డి అన్నారు. ప్రతీ ఒక్కరూ ఎంతైనా సంపాదించుకోవచ్చని పేర్కొన్నారు మంత్రి మల్లారెడ్డి.

I-T dept raids premises linked to Telangana minister Malla Reddy's kin |  Cities News,The Indian Express

సంపాదించుకున్న వాళ్లు సొంతంగా ట్యాక్స్ చెల్లించే విధంగా సీఎం కేసీఆర్ రూల్స్ తెస్తారని చెప్పారు. సీఎం కేసీఆర్ తన వెంట ఉన్నంత వరకు ఏ రైడ్స్కూ భయపడనని మల్లారెడ్డి స్పష్టం చేశారు. దేశ ప్రజలు రాష్ట్రంలో కేసీఆర్ ప్రవేశపెడుతున్న పథకాలు కావాలని కోరుకుంటున్నారని చెప్పారు. మార్పు కోసం దేశ ప్రజలు, మేధావులు ఆలోచన చేస్తున్నారని.. 2024లో కేంద్రంలో బీఆర్ఎస్ అధికారంలోకి రావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. ప్రపంచంలో ఏ దేశానికెళ్లిన మల్లారెడ్డి కాలేజీ విద్యార్థులుంటారని తెలిపారు మంత్రి మల్లారెడ్డి.

Read more RELATED
Recommended to you

Latest news