తెలంగాణ గురించి మాట్లాడే అర్హత మోడీకి లేదు : నిరంజన్‌రెడ్డి

-

నేడు హైదరాబాద్‌లో ప్రధాని మోడీ పర్యటించిన విషయం తెలిసిందే. అయితే పర్యటనలో భాగంగా బేగంపేట ఎయిర్‌పోర్టులో ఏర్పాటు చేసిన సభలో మోడీ ప్రసంగిస్తూ.. టీఆర్ఎస్‌, సీఎం కేసీఆర్‌పై విమర్శలు గుప్పించారు. అయితే.. మోడీ వ్యాఖ్యలపై రాష్ట్ర మంత్రి నిరంజన్ రెడ్డి మండిపడ్డారు. బేగంపేటలో మోదీ చేసిన వ్యాఖ్యలు దారుణమన్నారు. తల్లిని చంపి పిల్లను బతికించారన్న మోదీకి తెలంగాణ అమరవీరుల గురించి ఉచ్చరించే అర్హత కూడా లేదని చెప్పారు. తెలంగాణలో బీజేపీకి స్థానం లేదని అన్నారు. మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షాలు దేశాన్ని అమ్ముతుంటే… ముఖేశ్ అంబానీ, గౌతమ్ అదానీలు కొనుక్కుంటున్నారని నిరంజన్ రెడ్డి అగ్రహం వ్యక్తం చేశారు.

Hyderabad: Minister Niranjan Reddy dubs BJP 'Business Corporate Party'

మోదీ అధికారంలోకి వచ్చిన తర్వాత రూ. 100 లక్షల కోట్ల అప్పు చేశారని… ఆగస్టు వరకు మరో రూ. 8 లక్షల కోట్ల అప్పు చేసేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేసి పెట్టుకున్నారని అన్నారు. రూ. 11 లక్షల కోట్ల కార్పొరేట్ అప్పులను మాఫీ చేయించిన మోదీ… రూ. 4వేల కోట్లు పెట్టి తెలంగాణ రైతులు పండించిన ధాన్యం కొనమంటే మొహం చాటేస్తున్నారని విమర్శించారు నిరంజన్ రెడ్డి. కేంద్రంలో ఖాళీగా ఉన్న 15 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలను నింపడం చేతకాని మోదీ… యువత గురించి మాట్లాడటం హాస్యాస్పదంగా ఉందని విమర్శించారు నిరంజన్ రెడ్డి.

Read more RELATED
Recommended to you

Latest news