మంత్రి పొన్నం ప్రభాకర్ కాల్ రికార్డింగ్ ఆడియో లీక్

-

బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డితో కల్యాణలక్ష్మి చెక్కులు పంచనివ్వకండి అంటూ ఎమ్మార్వోకు ఆర్డర్ వేశాడు మంత్రి పొన్నం ప్రభాకర్. ఆడియోలో ఏముందంటే.. ?  ఎమ్మార్వో గారు.. నా ఫోన్ నెంబర్ లేదా తల్లి మీ దగ్గర.. మీ ఆర్డీవో గారు లైన్ లో ఉన్నారు. మొన్న  మీరు కళ్యాణ లక్ష్మీ చెక్కుల గురించి చెప్పారు కదా.. మంత్రి గారిని దృష్టిలో పెట్టి వారు చెప్పినట్టుగా ఆ టైమ్ తీసుకోని చేయండి.

మొన్నటి వరకు హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ గారు ఉండే.. ఎమ్మెల్సీగా కౌశిక్ రెడ్డి ఉన్నాడు. గవర్నమెంట్ బీఆర్ఎస్ కదా అని.. కౌశిక్ రెడ్డి ద్వారా కళ్యాణ లక్ష్మీ చెక్కులను పంపిణీ చేశారు. కానీ ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. ఎమ్మెల్యే మా పార్టీ అతను కాదు.. మీకే స్వేచ్ఛను ఇస్తున్నాం.. అధికారులు మీరు పంచండి. కానీ ఎమ్మెల్యే చేతితో ఒక్కటి కూడా పంచవద్దని సూచించారు మంత్రి పొన్నం ప్రభాకర్. అవసరం అయితే స్థానిక సర్పంచ్ లతో పంపించండి. కానీ ఎమ్మెల్యేతో పంచవద్దని ఎమ్మార్వోకి చెప్పాడు మంత్రి పొన్నం. 

Read more RELATED
Recommended to you

Exit mobile version