మహబూబ్ నగర్ లో నిర్వహించిన ఫ్రీడమ్ ర్యాలీలో భాగంగా గాలిలో కాల్పులు జరిపిన రాష్ట్ర మంత్రి శ్రీనివాస్ గౌడ్ ను వెంటనే మంత్రివర్గం నుంచి వెంటనే భర్తరఫ్ చేయాలని బిజెపి జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ డిమాండ్ చేశారు. శనివారం తిరంగా ర్యాలీలో మంత్రి గాలిలో కాల్పులు జరపడం బాధ్యతారహితమేనని ఆమె అభిప్రాయపడ్డారు. అసలు తెలంగాణలో పోలీసు వ్యవస్థ ఉందా అనే అనుమానం కలుగుతుందని సందేహం వ్యక్తం చేశారు.
తాను క్రీడా మంత్రిని అని, రబ్బర్ బుల్లెట్ అని మంత్రి చెప్పడం సిగ్గుచేటని అన్నారు. మంత్రి వెంట ఉన్న భద్రతా సిబ్బంది వాడుతున్నవి రబ్బర్ బుల్లెట్ల అంటూ ఎద్దేవా చేశారు. అంతేకాకుండా తనకు జిల్లా ఎస్పీ నే తుపాకీ ఇచ్చారని మంత్రి చెప్పిన విషయాన్ని ప్రస్తావించిన డీకే అరుణ.. మంత్రికి తుపాకీ ఇచ్చిన ఎస్పీపై క్రమశిక్షణ చర్యలు తీసుకొని, ఆయనను సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు.
Condemn this irresponsible act of 'firing’ by Minister Srinivas Goud & seek his dismissal from cabinet. His arrogance in firing & then defending it, both show an utter disregard for law & order.
The police personnel on duty too need to be reprimanded for this callousness. pic.twitter.com/YtIJef5u2D
— D K Aruna (@aruna_dk) August 13, 2022