రాష్ట్ర పశు సంవర్ధకశాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, బీజేపీ ప్రభుత్వం ప్రతిపక్షాలను అణచివేసేందుకే సీబీఐ, ఈడి దాడులకు చేపడుతుందని వ్యక్తపరిచారు. ఆదివారం కొమురవెళ్లి మల్లన్నను దర్శించుకున్నారు మంత్రి తలసాని . ఈ సందర్భంగా ఆలయ అర్చకులు పూర్ణ కుంభంతో స్వాగతం చెప్పారు . ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. కేంద్రానికి దమ్ముంటే అభివృద్ధి లో పోటీ పడాలని, ప్రశ్నించే గొంతులను నొక్కడం కాదని ఆగ్రహం వ్యక్తం చేసారు. వేల కోట్ల రూపాయల అప్పులు చేసి దేశం విడిచిపెట్టి వెళ్లిన వారిపై కేంద్రం ఏం చర్యలు తీసుకుందని అడిగారు మంత్రి తలసాని. ముఖ్యమంత్రి కేసీఆర్ కూతురు కవిత ఉద్యమాలే ఊపిరిగా, ప్రజా సేవే లక్ష్యంగా పనిచేస్తున్నారని అన్నారు.
తెలంగాణ సంస్కృతికి ప్రతీకగా నిలిచిన బతుకమ్మను విశ్వవ్యాప్తం చేసిన ఎమ్మెల్సీ కవితను, మహిళలను కించపరిచే విధంగా బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలు సరి కాదని మండిపడ్డారు. తెలంగాణ ప్రభుత్వం దేవాలయాలను అభివృద్ధి చేస్తుంటే, కొందరు దేవుళ్ల పేరుపై రాజకీయాలు చేస్తున్నారని అన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో దేవాలయాలు ఎంతో అభివృద్ధి చెందాయని పేర్కొన్నార. రానున్న ఎన్నికలలో బీజేపీకి ప్రజలు గుణపాఠం నేర్పుతారని అన్నారు మంత్రి తలసాని.