జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ మరియు ఏపీ సర్కార్ మధ్య వివాదం కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఒకరిపై మరోకరు మాటల దాడులు చేసుకుంటున్నారు నేతలు. అయితే… తాజాగా పవన్ కళ్యాణ్ పై దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ కౌంటర్ ఇచ్చాడు. చిరంజీవి లేకపోతే పవన్ కళ్యాణ్ ఒక బచ్చాగాడని… చెట్టు పేరు చెప్పుకుని కాయలు అమ్ముకునే రకం పవన్ కళ్యాణ్ అని విమర్శలు చేశారు.
పవన్ కళ్యాణ్ సినిమా షూటింగ్ కోసం ఆంధ్ర వచ్చినప్పుడు రాజకీయాలు గుర్తుకు వస్తాయని నిప్పులు చెరిగారు. గతంలో బిజెపిని పాచిపోయిన లడ్డు అన్నాడని.. ఇప్పుడు ఆ పార్టీ తోనే జత కట్టాడని ఆగ్రహం వ్యక్తం చేశారు వెల్లంపల్లి శ్రీనివాస్. బీఎస్పీ అధినేత్రి మాయావతి కాళ్లు కూడా పవన్ కళ్యాణ్ పట్టు కున్నాడని ఎద్దేవా చేశారు.
2024 లో తానే ముఖ్యమంత్రి అని ఇప్పుడు అంటున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతకు ముందు పవన్ కళ్యాణ్ పై సజ్జల రామకృష్ణా రెడ్డి నిప్పులు చెరిగారు. చంద్రబాబు 5 ఏళ్ల హయాంలో రోడ్ల రిపేర్లకు వెయ్యి కోట్లు కూడా ఖర్చు పెట్టలేదని… అప్పుడు పవన్ కళ్యాణ్ ఎందుకు ప్రశ్నించలేదు..రోడ్లు ఎందుకు పూడ్చలేదని నిలదీశారు. ఇవాళ వచ్చి రెండు తట్టల మట్టి వేస్తే అయిపోతుందా ? అని ఫైర్ అయ్యారు సజ్జల రామకృష్ణా రెడ్డి.