ఎన్ని చట్టాలు చేసిన ఎన్ని కఠిన శిక్షలు విధించినా కామాంధుల్లో మాత్రం మార్పు రావడం లేదు. చిన్నా పెద్దా తేడా లేకుండా స్త్రీలపై పడి విచక్షణ రహితంగా తమ కామవాంఛ తీర్చుకుంటున్నారు. అయితే.. ఇప్పుడు మరో దారుణ ఘటన చోటు చేసుకుంది. ఈఘటన కరీంనగర్ వీణవంక మండలం మల్లారెడ్డిపల్లిలో దారుణం జరిగింది. ఓ మైనర్ బాలికపై జేసీబీ డ్రైవర్ అత్యాచారానికి ఒడిగట్టాడు.
మల్లారెడ్డి పల్లి గ్రామనికి చెందిన మైనర్ బాలికకు మాయమాటలు చెప్పి గ్రామ శివారులోని గుట్టల్లోకి వరికొప్పుల శేఖర్ అనే జేసీబీ డ్రైవర్ తీసుకెళ్లాడు. అత్యాచారం చేసి బాలికను అక్కడే వదిలేసి వెళ్ళిపోయాడు. తల్లిదండ్రులతో కలిసి మైనర్ బాలిక పోలీసులను ఆశ్రయించింది. ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసుతో పాటు పోక్సో చట్టం కింద పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే.. నిందితుడిని కఠినంగా శిక్షించాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.