Breaking : డీఎంకే పార్టీ అధినేతగా మరోసారి ఎంకే స్టాలిన్‌ ఏకగ్రీవం

-

తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ డీఎంకే పార్టీ అధినేతగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఇటీవలే ఏర్పాటైన డీఎంకే జనరల్ కౌన్సిల్ ఇవాళ చెన్నైలో సమావేశమైంది. ఈ సమావేశంలో, డీఎంకే నేతలు స్టాలిన్ నాయకత్వానికే ఓటేశారు. డీఎంకే ప్రధాన కార్యదర్శిగా పార్టీ సీనియర్ నేత దురైమురుగన్, కోశాధికారిగా టీఆర్ బాలు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. సీఎం స్టాలిన్ తో పాటు దురైమురుగన్, టీఆర్ బాలు ఈ పదవులు చేపట్టడం ఇది రెండోసారి. తండ్రి కరుణానిధి మరణానంతరం స్టాలిన్ 2018లో తొలిసారి డీఎంకే చీఫ్ గా ఏకగ్రీవం అయ్యారు. 69 ఏళ్ల స్టాలిన్ గతంలో డీఎంకే పార్టీలో కోశాధికారిగానూ, పార్టీ యువజన విభాగం కార్యదర్శిగానూ వ్యవహరించారు.

పార్టీ వర్గాల సమాచారం ప్రకారం.. కొత్తగా ఏర్పడిన జనరల్ కౌన్సిల్ సమావేశంలో స్టాలిన్ పార్టీ అత్యున్నత పదవికి ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ప్రకటించారు. పార్టీ జనరల్ కౌన్సిల్ సమావేశంలో.. పార్టీ ప్రధాన కార్యదర్శులుగా దురై మురుగన్, కోశాధికారిగా టీఆర్ బాలు ఎన్నికయ్యారు. వీరు కూడా రెండోసారి తమ పదవులకు ఎన్నికయ్యారు. తమిళనాడు అధికార ద్రవిడ మున్నేట్ర కజగం (డీఎంకే) అధ్యక్ష పదవికి పోటీ చేసేందుకు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ శుక్రవారం నామినేషన్ దాఖలు చేశారు.

From 14-yr-old DMK cadre to Tamil Nadu's 8th Chief Minister; a look at MK  Stalin's journey | India News

కరుణానిధి మరణం తర్వాత 2018లో పార్టీ అధ్యక్షుడిగా స్టాలిన్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. డీఎంకే 1949లో స్థాపించబడింది. ద్రవిడ ఉద్యమ పార్టీ, డిఎంకె వ్యవస్థాపకుడు సిఎన్ అన్నాదురై 1969లో మరణించే వరకు పార్టీ ప్రధాన కార్యదర్శిగా కొనసాగారు. అ తరువాత కరుణానిధి తొలి సారి డీఎంకే అధ్యక్షుడయ్యారు. ఆయ‌న‌ 1969లో మరణించే వరకు అత్యున్నత పదవిలో కొనసాగాడు.

Read more RELATED
Recommended to you

Latest news