“ఈడీ నోటీసులపై స్పందించిన ఎమ్మెల్సీ కవిత”

-

ఢిల్లీ లిక్కర్ స్కీం ఇండియాలో ఎంత సంచలనాన్ని సృష్టించిందో తెలిసిందే. ఇప్పటికే ఈ కేసులో చాలా మందిని అరెస్ట్ చేయగా, కొందరు అప్రూవర్ గా మారిపోయి పోలీస్ డిపార్ట్మెంట్ కు మరియు ఈడీ కి తగిన సమాచారాన్ని ఇస్తూ మరికొందరిని పట్టుకోవడానికి సహకరిస్తున్నారు. ఇక తాజాగా ఈ కేసుకు సంబంధించిన తెలంగాణ ఎమ్మెల్సీ మరియు సీఎం కేసీఆర్ పుత్రిక కవితకు నోటీసులు ఇచ్చింది. ఈ నోటీసుపై కవిత స్పందించారు, ఈమె మాట్లాడుతూ .. “నాకు మోదీ నుండి నోటీసు వచ్చింది, ఇది రాజకీయ కక్షతోనే పంపించారు”, ఈ నోటీసుపై మేము మా లీగల్ టీం ను సంప్రదించి ఎటువంటి రెస్పాన్స్ పంపించాలి అన్నది నిర్ణయం తీసుకుంటాము అంటూ కవిత చెప్పింది. ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి మళ్ళీ మోదీ డ్రామాలు మొదలెట్టేసాడు అంటూ కవిత కామెంట్ చేసింది.

ఈ విషయాన్ని డైలీ సీరియల్ లాగా సాగదీస్తున్నారు అంటూ కవిత నిజామాబాద్ ప్రెస్ మీట్ లో చెప్పారు. కాగా ఈ నోటీసులో ఏముందో తెలియాల్సి ఉంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version