ఇటీవల కాలంలో పోడు వ్యవసాయంపై ఫారెస్ట్ అధికారుల దాడులు చేస్తున్నారు. అడవులను రక్షించే పనిలో పోడు వ్యవసాయాన్ని అడ్డుకుంటున్నామని ఫారెస్ట్ అధికారులు చెబుతున్నారు. ఇటీవల మహబూబాబాద్ జిల్లాలో ఇటీవల పోడు భూముల్లో వ్యవసాయం చేసుకుంటున్న రైతును అడ్డుకోవడంతో పాటు పంటను పీకేయడంతో వివాదం మొదలైంది. తాజాగా రైతులకు మద్దతుగా మహబూబాబాద్ టీఆర్ఎస్ ఎమ్మెల్యే శంకర్ నాయక్ అటవీ అధికారులపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఘటన జరిగిన బొల్లేపల్లికి వెళ్తా దమ్ముంటే అడ్డకోండని అధికారులకు సవాల్ విసిరారు. పంటలను ధ్వంసం చేసే అధికారం మీకెవ్వరు ఇచ్చారని ప్రశ్నించారు. మొక్కే కదా అని పీకేశారు కదా దాని రిజల్ట్ ఇప్పుడు చూడండి అంటూ అటవీ అధికారులకు సవాల్ విసిరారు. అడవులు తరిగిపోవడానికి మీరు కారణం కాదా అని అటవీ అధికారులను ప్రశ్నించారు. గతంలో కూడా మహబూబాబాద్, ములుగు, భూపాలపల్లి, ఆసిఫాబాద్ జిల్లాల్లో పోడు వివాదాలు రాజుకున్నాయి. కొన్నేళ్లుగా వ్యవసాయం చేసుకుంటున్న భూములను అటవీ భూములని చెబుతూ అధికారులు ఇబ్బందులకు గురిచేస్తున్నారని రైతులు రాజకీయనాయకులకు ఫిర్యాదు చేస్తున్నారు. దీంతో పోడు వ్యవసాయం రాజకీయంగా రగులుతోంది.
ఎమ్మెల్యే వర్సెస్ ఫారెస్ట్ ఆఫీసర్స్
-