ఈడీ కార్యాలయానికి ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డి పీఏ శ్రవణ్‌

-

మనీలాండరింగ్ కేసులో నోటీసులు అందుకున్న తాండూర్‌ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్‌రెడ్డి నేడు ఈడీ ముందుకు హాజరు కావాల్సి ఉంది. ఈ క్రమంలో రోహిత్ రెడ్డి ఈడీని మరికొంత సమయం కోరారు. ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డి తరఫున ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ కార్యాలయానికి వచ్చిన రోహిత్‌రెడ్డి పీఐ శ్రవణ్‌.. అధికారులు అడిగిన వివరాలు ఇవ్వటానికి సమయం కోరారు.

మనీలాండరింగ్ కేసులో వ్యాపార లావాదేవీలు, బ్లాక్ మనీ వ్యవహారంలో దర్యాప్తు చేపట్టిన ఈడీ.ఇవాళ విచారణకు రావాలని నోటీసులు జారీ చేసింది. 2015 ఏప్రిల్ నుండి కుటుంబ సభ్యుల ఆస్తుల వివరాలు అందిచంటతో పాటు 10 అంశాల బయోడేటా వివరాలతో రావాలని ఆదేశించింది. విద్యార్హతలు, కేసుల వివరాలను ఈడి ఇచ్చిన ఫార్మాట్లో సమర్పించాలని ఆదేశించింది.

ఈ నేపథ్యంలో ఉదయం తన నివాసం నుంచి బయలుదేరిన రోహిత్‌రెడ్డి…. నేరుగా ప్రగతిభవన్‌కు వెళ్లారు. ప్రగతి భవన్‌లో ముఖ్యమంత్రి కేసీఆర్‌తో భేటీ అయ్యారు. అనంతరం.. విచారణకు హాజరయ్యేందుకు సమయం కావాలని రోహిత్‌ రెడ్డి ఈడీని కోరారు.

Read more RELATED
Recommended to you

Latest news