జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై ఆ పార్టీ రాజోలు ఎమ్మెల్యే రాపాక వరప్రసాద రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. వాస్తవానికి తాను వైసీపీ వ్యక్తినని, రాజోలు నియోజకవర్గం వైసీపీలో మూడు గ్రూపులు ఉన్నాయని, అందులో తనదీ ఒక గ్రూప్ అంటూ వ్యాఖ్యానించారు. జగన్ పై ఎంతో అభిమానం ఉన్నప్పటికీ.. వైసీపీలో తనకు కాకుండా బొంతు రాజేశ్వరరావుకు టికెట్ ఇవ్వటంతోనే తాను జనసేనలోకి వెళ్లినట్లు తెలిపారు.
జనసేన కేవలం గాలివాటంగా వచ్చిన పార్టీ అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. అక్కడనుంచి గేలిపొందానని ఆయన తెలిపారు. అయితే గెలిచిన వెంటనే తాను సీఎం జగన్‌ని కలిసి.. కలిసి పనిచేద్దాం అని ఆయనకి చెప్పానని ఆయన బాంబ్ పేల్చారు. పవన్ కళ్యాణ్ నిబద్దత లేని మనిషి అని.. అందుకే ఆయన రెండూ చోట్ల గెలవలేకపోయారని ఆయన అన్నారు. ఏదిఏమైనా ఈ గ్రూపులు రాజకీయాలు పార్టీకి మంచిది కాదని, దీనిపై సీఎం జగన్ త్వరలోనే కలిసి.. వీటికి ఒక ముగింపు పడతామని ఆయన తెలియజేశారు.