హుస్నాబాద్ కు జలహారంగా గౌరవెల్లి ప్రాజెక్టు : ఎమ్మెల్యే సతీష్ కుమార్

భూ నిర్వాసితుల త్యాగంతో నెర్రెలు బారిన నేలలు త్వరలో సస్యశ్యామలం కాబోతున్నాయని హుస్నాబాద్ ఎమ్మెల్యే సతీష్ కుమార్ అన్నారు. తెలంగాణ అవతరణ దశాబ్ధి ఉత్సవాల్లో భాగంగా నీటి పారుదల, ఆయకట్టు అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో సాగునీటి దినోత్సవ సంబరాలు శుభం గార్డెన్ లో బుధవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. హుస్నాబాద్ ప్రాంతంలో ఎక్కడ చూసినా ఒకప్పుడు ఎండిపోయిన చెరువులు కుంటలు బతుకమ్మలో వినాయకుడి, దుర్గాదేవి నిమజ్జనం చేయాలంటే నీళ్లు లేక వెలవెలబోయేవని.. ఇప్పుడు ఎక్కడ చూసినా జలకళలతో చెరువులు, కుంటలు నిండుగా ఉన్నాయన్నారు. సీఎం కేసీఆర్ దూర దృష్టితో హుస్నాబాద్ కు జలహారంగా గౌరవెల్లి ప్రాజెక్టు నిలుస్తుందని గోదావరి జలాలతో ఈ ప్రాంతం సస్యశ్యామలం చేసి 1.6 లక్షల ఎకరాలకు త్వరలో నీళ్లందుతాయని అన్నారు.

ఒకరి కోసం అందరు అందరి కోసం ఒకరు అనే సహకార నినాదంతో ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘం లిమిటెడ్ కరీంనగర్ బ్యాంకు సేవలు అభినందనీయమని ఎమ్మెల్యే వొడితల సతీష్ కుమార్ అన్నారు. బుధవారం అక్కన్నపేట మండల కట్కూర్ గ్రామంలో 20 లక్షల వ్యయంతో నిర్మించే ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘం లిమిటెడ్ భవన నిర్మాణానికి భూమిపూజ, శంకుస్థ్ధాపన చేశారు. మాట్లాడుతూ సహకార రంగ బ్యాంకులలో కరీంనగర్ సహకార బ్యాంకు సంఘం సభ్యులు విశేషమైన సేవలు అందిస్తూ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఆండియా అభినందనలు పొంది నూతన ఓరవడితో దూసుకుపోతుందన్నారు.