AI అంటే అనుముల ఇంటెలిజెన్స్ అంటూ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఫైర్ అయ్యారు. అనుముల ఇంటెలిజెన్స్ రాష్ట్రంలో విధ్వంసం సృష్టిస్తుంది, అనుముల ఇంటెలిజెన్స్ పక్కకు జరిగితేనే రాష్ట్రం బాగుపడుతుందన్నారు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత.

ఇందిరా పార్క్ లో కవిత దీక్ష చేశారు. అసెంబ్లీలో పూలే విగ్రహం ఏర్పాటు చేయాలని కోరుతూ… ఇందిరా పార్క్ లో దీక్ష ప్రారంభించాటారు ఎమ్మెల్సీ కవిత. అయితే, బీఆర్ఎస్ బీసీ ఎమ్మెల్యేలు ఈ దీక్షపై స్పందించలేదని కాంగ్రెస్ ట్రోల్ చేస్తోంది. హైదరాబాద్ లో బీఆర్ఎస్ పార్టీకి తలసాని శ్రీనివాస్ యాదవ్, పద్మారావు గౌడ్ వంటి బీసీ నేతలు ఉన్నా… ఈ దీక్షకు హాజరు కాలేదని సెటైర్లు వేస్తోంది కాంగ్రెస్.