చేనేత వృత్తి అనేది వ్యాపారం కాదని.. ప్రధాని మోడీకి కల్వకుంట్ల కవిత లేఖ

-

మునుగోడు ఉప ఎన్నిక నేపథ్యంలో మంత్రి కేటీఆర్‌ చేనేతలో సమావేశమయ్యారు. ఈ సమావేశంలో చేనేతపై జీఎస్టీని కేంద్రం ప్రభుత్వం ఎత్తివేయాలని కోరుతూ లేక రాస్తామని.. అందరూ కూడా మోడీకి లేఖ రాయాలని సూచించారు. ఈ క్రమంలోనే మంత్రి కేటీఆర్ ఇచ్చిన పిలుపు మేరకు చేనేత ఉత్పత్తులపై జీఎస్టీ రద్దుచేయాలని ఆదివారం ప్రధాని మోదీకి ఎమ్మెల్సీ కవిత పోస్ట్ కార్డు రాశారు. ఈ సందర్భంగా ఆమె.. చేనేత వృత్తి అనేది వ్యాపారం కాదని, అది మన దేశ వారసత్వ సంపద అని టీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. చేనేత కళాకారులంతా గ్రామీణ ప్రాంతాలకు చెందిన పేదలు, బలహీనవర్గాల వారని, అలాంటి వారిని జీఎస్టీ పేరిట దోపిడీకి గురిచేయడం సరికాదని సూచించారు. మంత్రి కేటీఆర్ పిలుపునందుకుని చేనేతపై జీఎస్టీ ఎత్తివేయాలని డిమాండ్ చేస్తూ ప్రతి ఒక్కరూ ప్రధానికి పోస్ట్ కార్డ్ రాయాలని ప్రజలకు కవిత విజ్ఞప్తి చేశారు చేనేత పరిశ్రమ చేనేత కళాకారుడి నైపుణ్యత, సృజనాత్మకత, కష్టంపై ఆధారపడి మనుగడ సాగిస్తున్నదని, చేనేత కళాకారుడిలో వ్యాపార దృక్పథం ఏ కోశానా లేదని కల్వకుంట్ల కవిత పేర్కొన్నారు.

 

Kavitha letter to Modi | చేనేతపై జీఎస్టీ పూర్తిగా ఎత్తివేయాలి.. కేటీఆర్  పిలుపుతో ప్రధానికి కవిత లేఖ

దేశానికి స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటిదాకా ఏ ప్రభుత్వమూ చేనేత ముడి సరుకులపై, చేనేత వస్త్రాలపై ఎలాంటి పన్ను విధించలేదని గుర్తు చేశారు. కానీ, ఇప్పుడు మోదీ సారధ్యంలోని కేంద్ర ప్రభుత్వం చేనేత ముడి సరుకులపై, చేనేత వస్త్రాలపై 5 శాతం జీఎస్టీ విధించిందని, దాన్ని 12 శాతానికి పెంచాలనుకోవడం చేనేత కార్మికుల పాలిట ఉరితాడు అవుతుందని చేప్పేందుకు ఎలాంటి సందేహం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. దేశంలోని కోట్లాది పేద చేనేత కార్మికుల జీవితాల కోసం, చేనేత ముడి సరకులపై, చేనేత వస్త్రాలపై జీఎస్టీని వెంటనే రద్దు చేయాలని ప్రధానికి కల్వకుంట్ల కవిత విజ్ఞప్తి చేశారు. చేనేత సంబంధ వస్తువులపై విధిస్తున్న జీఎస్టీని పూర్తిగా తొలగించాలని ఆమె డిమాండ్ చేశారు. చేనేత ఉత్పత్తులపై జీఎస్టీ 5, 12 శాతంగా కాకుండా సున్నా శాతంగా ఉండాలని సూచించారు. మంత్రి కేటీఆర్‌ పిలుపుకు స్పందించి ప్రతి ఒక్కరూ ప్రధానికి ఈ విషయమై పోస్ట్‌ కార్డ్‌ రాయాలని, చేనేతపై జీఎస్టీ ఎత్తివేసేంత వరకు కేంద్రంపై ఒత్తిడి తేవాలని ఆమె ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news