గాలి మోటర్ల వచ్చుడు.. గాలి మాటలు చెప్పుడు.. ఆనవాయితైంది : కేటీఆర్‌

కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా నిన్న హైదరాబాద్‌లో పర్యటించి.. ప్రజా సంగ్రామ యాత్ర ముగింపు భారీ బహిరంగ సభలో పాల్గొన్నారు. ఈ క్రమంలో అమిత్‌ షా టీఆర్ఎస్‌ ప్రభుత్వంపై, సీఎం కేసీఆర్‌పై విమర్శలు చేశారు. అమిత్‌ షా వ్యాఖ్యలకు మంత్రి కేటీఆర్‌ కౌంటర్‌ ఇచ్చారు. ఆదివారం మంత్రి కేటీఆర్‌ మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. గ‌త కొద్దికాలంగా తెలంగాణ‌లో రాజ‌కీయ ప‌ర్యాట‌కుల సంద‌డి న‌డుస్తోంది. ఒక్కో టూరిస్టు వ‌చ్చి ఇష్ట‌మొచ్చిన‌ట్లు మాట్లాడి వెళ్తున్నారు. వారికి ఇక్క‌డి ప‌రిస్థితులు వారికి తెలియ‌వు. ఎయిర్‌పోర్టులోనూ, పార్టీ కార్యాల‌యాల్లోనూ చ‌క్క‌గా బిర్యానీ తిని, చాయ్ తాగి స్థానిక నాయ‌త‌క్వం రాసిచ్చిన స్ర్కిప్టు చ‌దువుతున్నారు.

KTR: అదే ద్రోహం.. అవే అబద్ధాలు: అమిత్‌షా పర్యటనపై కేటీఆర్‌

దాంట్లో స‌త్యం ఉందా? అస‌త్యం ఉందా? అనే విష‌యం తెలుసుకోకుండా నోటికొచ్చిన‌ట్లు మాట్లాడి తిరిగి వెళ్లిపోతున్నారంటూ ఆయన నిప్పులు చెరిగారు. అంతేకాకుండా గాలి మోటార్ల‌లో వ‌చ్చి గాలి మాట‌లు చెప్పి వెళ్లిపోతున్నార‌ని తీవ్ర స్థాయిలో కేటీఆర్ ధ్వ‌జ‌మెత్తారు. నిన్న అమిత్ షా వ‌చ్చి మాట్లాడిన మాట‌లు, చెప్పిన అబ‌ద్ధాలు చూస్తుంటే ఆయ‌న పేరును క‌చ్చితంగా మార్చుకోవాలని కేటీఆర్ సూచించారు. ఆయ‌న అమిత్ షా కాదు.. అబ‌ద్ధాల బాద్ షా. ఆయ‌న చెప్పిన దాంట్లో ఒక్క‌టంటే నిజం లేదు. ప‌చ్చి అబ‌ద్ధాలు మాట్లాడిండు. ప‌నికిమాలిన మాట‌లు చెప్పిండు. తెలంగాణ‌కు ప‌నికొచ్చే మాట చెప్ప‌లేదని మంత్రి కేటీఆర్‌ అగ్రహం వ్యక్తం చేశారు.