భారత ప్రధాని నరేంద్ర మోడీ కార్పొరేట్ శక్తులతో కుమ్మక్కయ్యారని ఆరోపించారు సిపిఐ జాతీయ ప్రధాన కార్యదర్శి డి రాజా. కార్పొరేట్ శక్తులకు అనుకూల ప్రభుత్వంగా మారిపోయి.. ఫెడరల్ సిస్టం ని దెబ్బతీస్తున్నారని మండిపడ్డారు. మోడీ దేశాన్ని తన సొంత ఆస్తి అనుకుంటున్నాడని విమర్శించారు. తెలంగాణ భూమి తిరుగుబాటుకి నిదర్శనం అని అన్నారు. నిజాం నీ తరిమిన గడ్డ తెలంగాణ.. సాయుధ పోరాటం చేసిన ప్రాంతం తెలంగాణ అని అన్నారు.
అసలు సాయుధ పోరాటంలో బిజెపి పాత్రే లేదన్నారు. ఎర్రజెండా త్యాగమే సాయిధ పోరాట ఫలమని అన్నారు డి. రాజా. కేంద్రం రాష్ట్రాల హక్కులను లాక్కుంటుందని.. బిజెపిని గద్దె దించాలని పిలుపునిచ్చారు. లేదంటే ప్రజాస్వామ్యం చచ్చిపోతోందన్నారు. మోడీ ప్రభుత్వాన్ని గద్దతించేందుకు నితీష్, కెసిఆర్ లు ముందుకు వచ్చారని తెలిపారు. నితీష్, కెసిఆర్ కొత్త అభివృద్ధి నినాదం ఎత్తుకున్నారని అన్నారు.