ఏపీకి మోడీ సర్కార్ శుభవార్త..రూ.879 కోట్లు నిధులు విడుదల

-

ఏపీ సర్కార్‌ కు మోడీ సర్కార్‌ అదిరిపోయే శుభవార్త చెప్పింది. రెవెన్యూ లోటుతో ఉన్న రాష్ట్రాలకు తాజాగా నిధులు విడుదల చేస్తూ కీలక ప్రకటన చేశారు. మొత్తం 14 రాష్ట్రాలు రెవెన్యూ లోటుతో ఉండగా… ఈ ఆర్థిక ఏడాదికి సంబంధించి వీటికి రూ.7183 కోట్లను విడుదల చేసినట్లు ఆర్థిక మంత్రిత్వ అధికారులు పేర్కొన్నారు. ఇందులో ఏపీకి రూ.879 కోట్లు విడుదల చేసినట్లు చెప్పారు.

దేశంలో 14 రాష్ట్రాలకు రూ.86201 కోట్లు ఇవ్వాలని 15వ ఆర్థిక సంఘం సిఫార్సు చేసిందని అధికారులు చెప్పారు. మొత్తం 12 విడతల్లో నిధులు విడుదల చేస్తామని.. తొలి విడతగా 7183 కోట్ల రూపాయలు విడుదల చేశామని చెప్పారు. ఇందులో ఆంధ్ర ప్రదేశ్‌ కు మొత్తం రూ.10,549 కోట్లు ఇవ్వాలని ఆర్థిక సంఘం సూచించగా.. తొలి విడతలో రూ.879 కోట్లు విడుదల చేశామని చెప్పారు. మిగిలిన నిధులు ఇతర రాష్ట్రాలతో పాటు 11 విడుదల్లో అందజేస్తామని ప్రకటన చేశారు. సీఎం జగన్‌ ఢిల్లీ టూర్‌ తర్వాత.. ఈ నిధులు విడుదల కావడం గమనార్హం.

Read more RELATED
Recommended to you

Latest news