మైన‌ర్ తో ఉపాధ్యాయురాలు జంప్.. పోలీసు విచార‌ణ‌లో షాకింగ్ నిజాలు

-

కాలేజీకి విద్యార్థులు.. చ‌దువుకోవ‌డానికి వెళ్తారు. మ‌రి లెక్చ‌ర‌ర్స్.. కాలేజీకి వ‌చ్చిన విద్యార్థుల‌కు విద్యా బుద్ధ‌లు నెర్పుతారు. విద్యార్థులు చెడు మార్గంలో వెళితే.. స‌రి చేసి జీవితానికి సంబంధించిన పాఠాల‌ను చెబుతారు. కానీ ఈ మ‌ధ్య కాలంలో కాలేజీల్లో ఇలాంటివి జ‌ర‌గ‌డం లేదు. కొన్ని చోట్ల‌ విద్యార్థుల‌తో లెక్చ‌ర‌ర్స్ రాస‌లీలలు, ప్రేమాయ‌ణాలు జ‌రుగుతున్నాయి. విద్యా బుద్దులు నెర్పించాల్సిన ఉపాధ్యాయులు.. పిల్ల‌ల‌కు కామ‌పాఠాలు చెబుతున్నారు. మైన‌ర్ విద్యార్థుల‌ను లోబ‌ర్చుకుంటున్నారు. ఇలా అన్ని విద్యా సంస్థ‌ల్లో జ‌ర‌గ‌కున్నా.. ఈ మధ్య కాలంలో కాస్త ఎక్కువే జ‌రుగుతున్నాయి. తాజా గా త‌మిళ‌నాడు లోని తిరుచ్చిలో ఇలాంటి ఘ‌ట‌ననే చోటు చేసుకుంది.

ఒక మైన‌ర్ విద్యార్థితో లేడీ లెక్చ‌ర‌ర్ జంప్ అయింది. విద్యార్థి కాలేజీ నుంచి ఇంటికి రాక‌పోవ‌డంతో విద్యార్థి ఫ్యామిలీ పోలీసుల‌కు ఫిర్యాదు చేశారు. అదే స‌మ‌యంలో ఉపాధ్యాయురాలు కూడా కాలేజీ నుంచి రాలేదు. ఉపాధ్యాయురాలు కుటుంబ స‌భ్యులు కాలేజీకి వెళ్లి విచారించారు. ఆ ఉపాధ్యాయురాలు ఆ రోజు కాలేజీకి రాలేద‌ని తెలిపారు. ఇక పోలీసులు రంగంలోకి విచార‌ణ చేప‌ట్ట‌గా.. సంచ‌ల‌న విషయాలు బ‌య‌ట‌కు వ‌చ్చాయి.

త‌న కంటే 10 ఏళ్లు చిన్న వ‌య‌స్సులో ఉన్న కుర్రాడితో ఉపాధ్యాయురాలు జంప్ అయింద‌ని తెలిసింది. ఇద్ద‌రి ఫోన్లు ఒకే సారి స్విచ్ ఆఫ్ కావ‌డంతో పాటు కుర్రాడి కాల్ రికార్డ్స్ ఆధారంగా అస‌లు నిజం తెలిసింది. కొద్ది రోజుల త‌ర్వాత పోలీసులు వారిని అరెస్టు చేశారు. విద్యార్ధిని జువైన‌ల్ హోంకి త‌ర‌లించారు.

Read more RELATED
Recommended to you

Latest news