మోడీ గ్యారెంటీ అంటే అభివృద్ధి కి గ్యారెంటీ : ప్రధాని మోడీ

-

మోడీ గ్యారెంటీ అంటే అభివృద్ధి కి గ్యారెంటీ అన్నారు ప్రధాని మోడీ. రాబోయే ఐదేళ్లలో మూడు కోట్ల ఇండ్ల నిర్మాణానికి గ్యారెంటీఅన్నారు.   దేశ భవిష్యత్ ను నిర్ణయించే ఎన్నికలు ఇవి. 70 ఏళ్లు పైబడిన వృద్ధులకు ఉచిత వైద్యం గ్యారెంటీ అన్నారు. పది సంవత్సరాల్లో దేశం  అభివృద్ధి చెందింది. పదేళ్లలో తెలంగాణకి లక్షల కోట్లు అందించాం. బీఆర్ఎస్ తన జేబులనునింపుకుంది.. తెలంగాణలో కాంగ్రెస్ కూడా అలాగే చేస్తుంది. కాంగ్రెస్ కూటమీ అబద్దపు హామీలు ఇస్తుంది.

మోసపూరిత వాగ్దానాలు చేసి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. బీఆర్ఎస్ పదేళ్లలో ఎంత అవినీతి చేసిందో.. కాంగ్రెస్ కొన్ని నెలల్లోనే చేయాలని చూస్తుంది. బీఆర్ఎస్ చేసిన స్కామ్ ను కాంగ్రెస్ కలం కూడా కదిలించడానికి సిద్ధంగా లేదన్నారు. ఢిల్లీలో కూడా ఆర్ఆర్ ట్యాక్స్ గురించి భారీగా చర్చలు జరుగుతున్నాయన్నారు. ఆర్ఆర్ ట్యాక్స్ గురించి నేను పేర్లు చెప్పలేదు.. తెలంగాణ సీఎం మీడియా ముందు చెప్పారు. అంటే..  ఆర్ఆర్ ట్యాక్స్ ఎవరి జేబుల్లోకి వెళ్తుందనేది మీరు అర్థం చేసుకోవాలి.

Read more RELATED
Recommended to you

Latest news