తెలంగాణకు మోదీ..కేసీఆర్ డౌటే..భారీ ప్లాన్‌తో బీజేపీ..!

-

తెలంగాణలో రాజకీయాల్లో టీఆర్ఎస్-బీజేపీల మధ్య ఫైట్ ఏ స్థాయిలో జరుగుతుందో చెప్పాల్సిన పని లేదు. రెండు పార్టీల మధ్య మాటల యుద్ధమే కాదు..ఆఖరికి కొట్టుకునేవరకు వెళ్లిపోయారు. ఓ వైపు మునుగోడు ఉపఎన్నిక, మరో వైపు ఎమ్మెల్యేల కొనుగోలు కేసు..ఈ రెండు అంశాలు ఇప్పుడు తెలంగాణలో హాట్ టాపిక్ గా ఉన్నాయి. రేపు ఎలాగో మునుగోడు ఫలితం తేలిపోతుంది. ఇక ఎమ్మెల్యేల కొనుగోలు అంశంలో రెండు పార్టీల మధ్య కౌంటర్, ఎన్‌కౌంటర్లు నడుస్తున్నాయి.

 

ఈ విషయంలో ఎవరు వెనక్కి  తగ్గడం లేదు. కాకపోతే అటు నుంచి కేసీఆర్ మాత్రమే ప్రెస్ మీట్ పెట్టి..ఎమ్మెల్యేల కొనుగోలు అంశంలో ఓ సినిమా చూపించారు. ఇక దానికి కౌంటరుగా బీజేపీ నేతలు వరుసపెట్టి కేసీఆర్‌పై మాటల దాడి చేస్తున్నారు. అలాగే ఇతర పార్టీల ఎమ్మెల్యేలని లాక్కుని కేసీఆర్…ఇప్పుడు ప్రజాస్వామ్యం ఖూనీ జరిగిందని మాట్లాడటం కామెడీగా ఉందని అంటున్నారు.

ఇలా రెండు పార్టీల మధ్య జరుగుతుండగానే..తెలంగాణలో మరో అనూహ్యమైన రాజకీయానికి తెరలేవనుంది. ఎమ్మెల్యేల కొనుగోలు కేసు  నడుస్తుండగానే  ప్రధాని మోదీ తెలంగాణలో పర్యటించనున్నారు. ఈ నెల 12న ఆయన తెలంగాణలోకి ఎంట్రీ ఇవ్వనున్నారు. 11వ తేదీన ఏపీలో పర్యటించి..అక్కడ పలు అభివృధ్ది కార్యక్రమాలు ప్రారంభించనున్నారు. ఆ తర్వాత తెలంగాణకు వచ్చి రామగుండంలో ఎరువుల ఫ్యాక్టరీని జాతికి అంకితం చేయనున్నారు. ఇక రామగుండంలో మోదీ సభని భారీ సక్సెస్ చేసేందుకు బండి సంజయ్..ఇప్పటినుంచే సమీక్షా సమావేశాలు నిర్వహిస్తున్నారు.

తాజాగా ఆదిలాబాద్, వరంగల్, కరీంనగర్ బీజేపీ నేతలు, శ్రేణులతో సమావేశం పెట్టి..లక్ష మందిపైనే జనంతో మోదీ సభ నిర్వహించాలని సూచించారు. అలాగే ఈ  సభలో మోదీ ద్వారా..కేసీఆర్‌కు స్ట్రాంగ్ కౌంటర్లు ఇచ్చేయాలని చూస్తున్నారు. ఇక మోదీ పర్యటనకు సీఎం హోదాలో కేసీఆర్ హాజరవుతారో లేదో డౌటే. ఇదివరకే పలుమార్లు ఆయన హాజరు కాలేదు. ఈ సారి కూడా హాజరవ్వరని తెలుస్తోంది. ఈ పరిణామాలు నేపథ్యంలో మోదీ సైతం..కేసీఆర్ టార్గెట్‌గా స్ట్రాంగ్ కౌంటర్లు ఇచ్చే ఛాన్స్ కనిపిస్తోంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version