BREAKING : 5జీ సేవలను దేశ ప్రధాని నరేంద్ర మోడీ..ప్రారంభించారు. కాసేటి క్రితమే.. ఈ సేవలను ప్రారంభించారు. ఢిల్లీలోని ప్రగతి మైదాన్‌లో 6వ ఇండియా మొబైల్ కాంగ్రెస్‌ను ప్రారంభించి, 5జీ సేవలను ప్రారంభించారు ప్రధాని నరేంద్ర మోదీ. దీంతో ముందుగా మెట్రో నగరాల్లో అందుబాటులోకి 5జీ వచ్చింది. రెండేళ్ల తర్వాత దేశవ్యాప్తంగా 5జీ సేవలు రానున్నాయి.
ఇది ఇలా ఉండగా.. వచ్చే రెండేళ్లలో దేశవ్యాప్తంగా 5జి సర్వీసులు అందుబాటులోకి వస్తాయని మంత్రిత్వ శాఖ తెలిపింది. 5జి సర్వీస్ అనేది కొత్త ఆర్థిక అవకాశాలతో పాటు సామాజిక ప్రయోజనాలను కూడా ఆవిష్కరించగలదని, ఇది దేశ అభివృద్ధిలో కీలకపాత్ర పోషించడంతోపాటు ‘డిజిటల్ ఇండియా’ విజన్ ను ముందుకు తీసుకెళ్లడానికి సహాయపడుతుందని, 2035 నాటికి భారతదేశంపై 5జి ఆర్థిక ప్రభావం 450 బిలియన్ డాలర్లకు చేరుకుంటుందని మంత్రిత్వ శాఖ తెలిపింది.
#WATCH | PM Modi inspects an exhibition at Pragati Maidan where he will inaugurate the sixth edition of the Indian Mobile Congress (IMC) and launch 5G services shortly.
Chairman of Reliance Jio, Akash Ambani briefs the PM on the shortly-to-be-launched 5G services.
(Source: DD) pic.twitter.com/tjF0RWfZV9
— ANI (@ANI) October 1, 2022