జనాలకు అమ్మా అయ్యా అని చెప్తే అర్ధం కాదు. గడ్డం పట్టుకు చెప్తే ఎవడు వింటాడు చెప్పండి. బయటకు రావొద్దు బాసూ అని చెప్తే ఎవరూ వినడం లేదు. అందుకే ఇప్పుడు దేశ వ్యాప్తంగా పోలీసులు సంచలన నిర్ణయాలు తీసుకున్నారు. బయటకు వస్తే బాదుడే… బయటకు వస్తే పచ్చిగా చెప్పాలి అంటే కుక్కను కొట్టినట్టు కొడుతున్నారు. అవును ఇప్పుడు ఈ బాదుడుని అందరూ సమర్ధిస్తున్నారు.
బయటకు రావొద్దు అని చెప్తుంటే ఎవరూ వినడం లేదు కాబట్టి పోలీసులు బాదుడ్ని నమ్ముకున్నారు. దీనితో జనాలు బయటకు రావాలి అంటే భయపడుతున్నారు. ఎవరూ కూడా బయటకు వచ్చే సాహస౦ చేయడం లేదు. బయటకు వెళ్తే వాచిపోతుంది అనే విషయం అందరికి అర్ధం అయింది. దానికి తోడు మరిన్ని కీలక నిర్ణయాలు కూడా తీసుకున్నారు. బయటకు వస్తే… మాత్రం జైలుకి తరలించినట్టే.
ఆరు నెలల వరకు జైలు శిక్ష పడుతుంది. ఆరు నెలల వరకు బెయిల్ ఉండదు. ఆరు నెలల వరకు ఎవరూ వాళ్ళను కలిసే అవకాశం ఉండదు. హత్య కేసు నమోదు చేస్తారు. హత్యా కేసుతో పాటుగా భారీ జరిమానా విధించే అవకాశాలు కూడా కనపడుతున్నాయి. పోలీసులు ప్రభుత్వాలు తీసుకుంటున్న నిర్ణయాలను అందరూ అన్ని విధాలుగా సమర్ధిస్తున్నారు. మాట వినకపోతే ఇదే మార్గం అంటున్నారు.
కొంత మంది అయితే షూట్ ఎట్ సైట్ ఆర్డర్స్ జారీ చేసినా తప్పు లేదని అంటున్నారు. కాల్చి పారేసినా తప్పు లేదని నాలుగు రోజులు బయటకు రాకపోతే పోయేది ఏమి ఉంటుందని ప్రశ్నిస్తున్నారు. మన ప్రాణాలను కాపాడుకోవాలి అంటే బయటకు రాకుండా ఉండటమే ఉత్తమ నిర్ణయం అని అప్పుడే ప్రభుత్వాలు దీనిని కట్టడి చేయడానికి అవకాశం ఉంటుందని అంటున్నారు. మాట వినాలని కోరుతున్నారు.