ఉద్యోగులకు మోదీ అదిరిపోయే గుడ్ న్యూస్…జీతాల పెంపుపై కీలక ప్రకటన..

-

ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న ఉద్యోగుల కోరికను ప్రభుత్వం తీర్చానుంది..ఉద్యోగులకు మోదీ ప్రభుత్వం గుడ్ న్యూస్ ను చెప్పనుంది..ఈ రోజు కీలక ప్రటకన చేయనుందా? నేటి క్యాబినెట్ మీటింగ్‌లో కేంద్ర ప్రభుత్వం ఉద్యోగులకు తీపికబురు అందించబోతోందని నివేదలు వెలువడుతున్నాయి. ఇదే జరిగితే చాలా మందికి బెనిఫిట్ కలుగుతుందని చెప్పుకోవచ్చు. ఈరోజు ప్రభుత్వం డియర్‌నెస్ అలవెన్స్ పెంపు అంశంపై కీలక ప్రకటన చేయనుందని మీడియా నివేదికలు పేర్కొంటున్నాయి. డియర్‌నెస్ అలవెన్స్ పెంచొచ్చని తెలియజేస్తున్నాయి. దీని వల్ల అటు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు, ఇటు పెన్షనర్లకు ఊరట కలుగుతుందని తెలుస్తుంది…

 

ఈరోజు క్యాబినెట్ మీటింగ్ జరగనుందని, ఇందులో మోదీ సర్కార్ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు డియర్‌నెస్ అలవెన్స్‌ పెంపుపై కీలక ప్రకటన చేయనుందని ఓ వార్త ఛానెల్ చెప్పింది.. ఇకపోతే ప్రస్తుతం 38 ఉన్నది ఈ ప్రకటన తర్వాత 42 శాతం పెరగనుందని సమాచారం..ఉద్యోగులకు, పెన్షనర్లకు డియర్‌నెస్ అలవెన్స్ అనేది లేటెస్ట్ కన్సూమర్ ప్రైస్ ఇండెక్స్‌ గణాంకాల ప్రకారం లెక్కిస్తారు. కార్మిక మంత్రిత్వ శాఖ ప్రతి నెలా ఈ డేటాను విడుదల చేస్తూ వస్తుంది..

కాగా,రిటైల్ ద్రవ్యోల్బణం స్వల్పంగా దిగివచ్చింది. 6.44 శాతంగా నమోదు అయ్యింది. ఫిబ్రవరి నెలకు ఇది వర్తిస్తుంది. ఫుడ్ ఐటమ్స్ ధరలు తగ్గడం ఇందుకు ప్రధాన కారణంగా చెబుతున్నారు.పెరిగిన డీఏ అనేది 2023 జనవరి 2 నుంచి అమలులోకి వస్తుంది. చివరిగా డియర్‌నెస్ అలవెన్స్ పెంపు అనేది 2022 సెప్టెంబర్ 28న జరిగింది. అది 2022 జూలై 1 నుంచి అమలులోకి వచ్చింది. 38 శాతంగా డీఏ ఉంది..ఏడాదికి రెండు సార్లు డీఏ పెంపు ఉంటుంది. జనవరి నుంచి జూన్ కాలానికి ఒకసారి పెంపు వర్తిస్తుంది. అలాగే జూలై నుంచి డిసెంబర్ కాలానికి రెండో సారి డీఏ పెంపు ఉంటుంది. సాధారణంగా కేంద్ర ప్రభుత్వం హోలీ పండుగకే డీఏ పెంచుతారని అనుకున్నారు.. కానీ అలా జరగలేదు.. మరి ఉగాదికి పెంచుతారో లేదో చూడాలి..

Read more RELATED
Recommended to you

Latest news