Breaking : మొయినాబాద్ ఫామ్ హౌస్ కేసులో ముగ్గురు నిందితులకు వైద్య పరీక్షలు పూర్తి

-

మునుగోడు ఉప ఎన్నిక నేపథ్యంలో తెలంగాణలో ఎమ్మెల్యేల ఆపరేషన్ ఆకర్ష్ వ్యవహారం దుమారం రేపుతోంది. ఒక్కో ఎమ్మెల్యేకు 100 కోట్లతో పాటు పదవులు, కాంట్రాక్టులు ఆశజూపారని.. అడ్వాన్స్ డబ్బులతో మొయినాబాద్‌లోని పైలట్ రోహిత్ రెడ్డి ఫామ్ హౌజ్‌కు టీఆర్ఎస్ ఆరోపిస్తోంది. ఈ నేపథ్యంలో.. మొయినాబాద్ ఫామ్ హౌస్ కేసులో పోలీసులు అరెస్ట్‌ చేసిన ముగ్గురు నిందితులకు వైద్య పరీక్షలు పూర్తయ్యాయి. శంషాబాద్ రూరల్ పోలీస్ స్టేషన్ ఆవరణలో నే వైద్య పరీక్షలు పూర్తి చేసినట్టు వైద్యులు చెప్పారు. నర్కుడ పీహెచ్ సీ వైద్యుడు పీఎస్ కు వచ్చి నిందితులకు వైద్య పరీక్షలు నిర్వహించారు. రామచంద్ర భారతీ, నందకుమార్, సింహయాజులును కోర్టులో హాజరుపర్చనున్నారు.

తెలంగాణను షేక్ చేస్తున్న పొలిటికల్ డీల్.. అంతా 'నందు' చుట్టే తిరుగుతున్న  రాజకీయం.. అసలెవరితను? | TV9 Telugu

పోలీసులు వారి రిమాండ్ రిపోర్టును రెడీ చేస్తున్నారు. మొయినాబాద్ ఫాంహౌస్ కేసులో అరెస్టు చేసిన ముగ్గురి సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్న పోలీసులు ఫోన్ డేటా ఆధారంగా దర్యాప్తు జరుపుతున్నారు. ఎవరితో టచ్ లోఉన్నారన్న కోణంలో ఎంక్వైరీ చేస్తున్నారు. ఇదిలా ఉంటే నందు అనే వ్యక్తి పొలిటికల్ లీడర్లతో దిగిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్గా మారుతున్నాయి. మరోవైపు అజీజ్ నగర్ ఫాం హౌస్లో శంషాబాద్ జోన్ డీసీపీ జగదీశ్వర్ రెడ్డి మరోసారి తనిఖీలు చేశారు. ఇదిలా ఉంటే నిన్న డబ్బులున్నట్లు చెబుతున్న బ్యాగుల్లో ఏమీ దొరకలేదని ప్రచారం జరుగుతోంది. పోలీసులు కూడా ఆ డబ్బు సంచుల్ని ఓపెన్ చేసి చూపించకపోవడం అనుమానాలకు తావిస్తోంది. దీంతో పోలీసులు ఈ రోజు మరోసారి ఫాంహౌజ్ లో తనిఖీలు నిర్వహించారు. మొయినాబాద్ ఫాంహౌజ్ లోపలికి ఎవర్ అనుమతించడం లేదు.

 

Read more RELATED
Recommended to you

Latest news