రాణించిన పాక్‌ బౌలర్లు.. జింబాబ్వే స్కోర్‌ 130

-

భారత్ చేతిలో ఎదురైన ఓటమి నుంచి పాకిస్తాన్ తేరుకుంది. టీ20 ప్రపంచకప్ 2022లో భాగంగా గ్రూప్ ‘2’లో జింబాబ్వే తో జరిగిన మ్యాచ్ లో పాకిస్తాన్ బౌలర్లు రాణించారు. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న జింబాబ్వే 20 ఓవర్లలో 8 వికెట్లకు 130 పరుగులు చేసింది. పాక్ బౌలర్ల ధాటికి భారీ స్కోరు సాధించలేకపోయింది జింబాబ్వే. నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లకు 130 పరుగులు మాత్రమే చేయగలిగింది.

Pakistan vs Zimbabwe, T20 World Cup 2022, Live Score Updates: Pakistan In  Control As Zimbabwe Crumble In Perth | Cricket News

జింబాబ్వే ఇన్నింగ్స్ లో షాన్ విలియమ్స్ అత్యధికంగా 31 పరుగులు చేశాడు. పాకిస్థాన్ బౌలర్లలో పేసర్ మహమద్ వాసిమ్ జూనియర్ 4 వికెట్లు తీయగా, స్పిన్నర్ షాదాబ్ ఖాన్ 3 వికెట్లు పడగొట్టాడు. హరీస్ రవూఫ్ 1 వికెట్ తీశాడు. పాక్ కొత్త బంతి బౌలర్లు షహీన్ అఫ్రిది, నసీమ్ షా ఈ మ్యాచ్ లో ఒక్క వికెట్టు కూడా తీయలేకపోయారు.

 

Read more RELATED
Recommended to you

Latest news