విజయవాడలో మంకీ పాక్స్ కలకలం

-

విజయవాడలో మంకీపాక్స్‌ కలకలం రేపింది.దుబాయ్‌ నుంచి వచ్చిన ఓ రెండేళ్ల చిన్నారికి మంకీ పాక్స్‌ లక్షణాలు ఉన్నట్లుగా అధికారులు అనుమానిస్తున్నారు.చిన్నారి ఒంటిపై దద్దుర్లు రావడంతో విజయవాడ పాత ప్రభుత్వాస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు.కుటుంబం మొత్తాన్ని అధికారులు ఐసోలేషన్‌లో ఉంచినట్లు తెలుస్తోంది. చిన్నారి నుంచి సేకరించిన నమూనాలను అధికారులు పుణె ల్యాబ్‌కు పంపారు.

దీనికి సంబంధించిన సమాచారాన్ని వైద్యారోగ్యశాఖ అధికారులు గోప్యంగా ఉంచుతున్నారు.ఓ వైపు కరోనాతో సతమతమవుతున్న ప్రజలపై వైరస్‌లు దండయాత్ర మొదలుపెట్టాయి. ఇప్పటికే కరోనాతో పాటు జికా వైరస్‌లు దేశంలో వ్యాప్తి చెందుతుండగా.. ఇప్పుడు దానికి మంకీపాక్స్ తోడైంది.అయితే దేశంలో తాజాగా నమోదవుతున్న మంకీ ఫాక్స్ కేసుల పట్ల అప్రమత్తమైంది కేంద్ర ఆరోగ్య శాఖ.మంకీ పాక్స్ వ్యాధి నివారణ కోసం నూతన మార్గదర్శకాలను విడుదల చేసింది కేంద్ర ఆరోగ్య శాఖ.

తాజాగా కేరళలో మంకీఫాక్స్ కేసు నమోదుతో..అంతర్జాతీయ ప్రయాణికులు అనారోగ్యంతో ఉన్న వ్యక్తులతో కలవకూడదని సూచించింది.విదేశాల నుంచి వచ్చే ప్రయాణికులు ఆరోగ్య సమస్యలు ఏమైనా ఉంటే ఇతరులకు దూరంగా ఉండాలని సూచించింది.జ్వరంతోపాటు ,చర్మ దద్దుర్లు లక్షణాలు ఉన్నవారు వెంటనే హాస్పిటల్ లో వైద్యులను సంప్రదించాలి హెచ్చరించింది.

Read more RELATED
Recommended to you

Latest news