ప్రపంచ వ్యాప్తంగా భయాందోళనకు గురి చేస్తోన్న మంకీపాక్స్ ఇప్పుడు తెలంగాణలోని కామారెడ్డి వెలుగులోకి వచ్చింది. దీంతో కామారెడ్డి జిల్లాలో మంకీ పాక్స్ కలవరం మొదలైంది. జిల్లా కేంద్రంలోని ఇందిరానగర్ కాలనీకి చెందిన ఓ వ్యక్తికి మంకీ ఫాక్స్ వ్యాధి లక్షణాలు ఉన్నట్లు గుర్తించారు కామారెడ్డి గవర్నమెంట్ ఏరియా హాస్పిటల్ డాక్టర్లు. అయితే.. ఈనెల 6వ తారీఖున కువైట్ నుంచి ఇండియాకు వచ్చిన వ్యక్తి మంకీ పాక్స్ లక్షణాలు కనిపించడంతో.. రక్త నమూనాలను పరీక్ష నిమిత్తం హైదరాబాద్ లోని ఫీవర్ హాస్పిటల్ కు పంపిచారు డాక్టర్లు.
ప్రస్తుతం కామారెడ్డి గవర్నమెంట్ ఏరియా హాస్పిటల్ లో సదరు వ్యక్తి చికిత్స పొందుతున్నాడు. హైదరాబాద్ ఫీవర్ హాస్పిటల్ నుంచి రక్త నమూనాలకు ఫలితాలు వచ్చాకే మంకీ పాక్స్‌పై క్లారిటీ రానుంది. అయితే ఇప్పటికే దేశంలో పలు రాష్ట్రాల్లో మంకీ పాక్స్ కేసులు నమోదవుతున్నాయి. మంకీ పాక్స్ ఎక్కువగా శృంగారం కారణం వస్తుందని నివేదక వెల్లడిస్తున్నాయి.