మారిన వాతావరణ పరిస్థితులు.. తెలుగు రాష్ట్రాలకు వర్షసూచన

-

నైరుతి రుతుపవనాల ఆగమనం దేశంలో త్వరగానే జరిగినా ఇంకా తెలుగు రాష్ట్రాల్లోకి రావడానికి మొండికేస్తున్నాయి. అయితే.. సాధారణంగా ఇప్పటికే తెలంగాణలో నైరుతి సీజన్ మొదలవ్వాల్సి ఉండగా, ఇప్పటికీ రుతుపవనాల జాడలేదు. దీనిపై భారత వాతావరణ విభాగం (ఐఎండీ) వివరణ ఇచ్చింది. ఏపీ, తెలంగాణ, తమిళనాడు రాష్ట్రాల్లో నైరుతి రుతుపవనాల విస్తరణకు అనుకూల వాతవరణం ఉందని, మరో రెండ్రోజుల్లో రుతుపవనాలు ఆయా రాష్ట్రాల్లో ప్రవేశిస్తాయని వెల్లడించింది వాతావరణ శాఖ. వచ్చే రెండ్రోజుల్లో ఏపీ దక్షిణ, ఉత్తర కోస్తా జిల్లాల్లో మోస్తరు నుంచి తేలికపాటి జల్లులు కురుస్తాయని తెలిపింది.

Monsoon to be 'normal' in August and September: IMD | Latest News India -  Hindustan Times

అదే సమయంలో, ఉత్తర భారతదేశం వైపుగా నైరుతి రుతుపవనాలు వేగంగా కదిలేందుకు అనుకూల వాతావరణం నెలకొందని ఐఎండీ వెల్లడించింది. ప్రస్తుతం కర్ణాటక, గోవా, కొంకణ్, బెంగళూరు, పుణే, పుదుచ్చేరి ప్రాంతాలపై రుతుపవనాలు విస్తరించాయని ఐఎండీ వివరించింది. రుతుపవనాల గమనం నెమ్మదిగా ఉండడం వల్ల విస్తరణ ఆలస్యమైందని పేర్కొంది వాతావరణ శాఖ.

Read more RELATED
Recommended to you

Latest news