ఎంతగానో వెయిట్ చేస్తున్న రవితేజ “రావణాసుర” ట్రైలర్ రేపే !

-

టాలీవుడ్ లో మాస్ మహారాజాగా పేరు తెచ్చుకున్న రవితేజ మొన్ననే ధమాఖా సినిమాతో హిట్ ను అందుకున్నాడు. ఖిలాడీ మరియు రామారావు ఆన్ ది డ్యూటీ సినిమాల ప్లాప్ ల తర్వాత కొంచెం వెనక్కు తగ్గినా ధమాకా లాంటి సూపర్ బ్లాక్  బస్టర్ తో మళ్ళీ హిట్ ట్రాక్ ఎక్కాడు. ఈ సినిమా తర్వాత రవితేజ మంచి క్యాచీ టైటిల్ “రావణాసుర”తో మన ముందుకు రానున్నాడు. ఇందులో రవితేజ ముగ్గురు ముద్దుగుమ్మలతో ఆడిపాడనున్నాడు. ఈ సినిమా ఖచ్చితంగా హిట్ ను సాధించాలన్న కసితో ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నాడు డైరెక్టర్ సుధీర్ వర్మ.

ఇప్పటి వరకు రావణాసుర టైటిల్ సాంగ్ మరియు పోస్టర్ లను మాత్రమే చిత్ర బృందం విడుదల చేసింది. కాగా ఇపుడు సినిమాను ప్రేక్షకుల్లోకి తీసుకు వెళ్లే ట్రైలర్ ను రిలీజ్ చేయడానికి ముహుర్తాన్ని ఖరారు చేసింది. రావణాసుర ట్రైలర్ ను రేపు సాయంత్రం సరిగ్గా 4.05 గంటలకు విడుదల చేయనున్నారు. మరి ఈ ట్రైలర్ ఎంత మేరకు ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది అన్నది తెలియాలంటే రేపటి వరకు ఆగాల్సిందే. అయితే ఇప్పటికే ఈ సినిమా విడుదల తేదీని ప్రకటించింది. రావణాసుర ఏప్రిల్ 7 వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా థియేటర్ లలోకి అడుగు పెట్టనుంది.

Read more RELATED
Recommended to you

Latest news