బీడీ కార్మికుల కోసం 500 పడకల ఆసుపత్రిని నిర్మిస్తాం : ధర్మపురి అర్వింద్‌

70 శాతం మంది మహిళలు అంగీకరిస్తేనే గ్రామంలోని వైన్స్ లకు పర్మిషన్ల తొలగింపు, బెల్ట్ షాపుల పర్మిట్ రూములను మూసివేస్తామని చెప్పారు నిజామాబాద్ ఎంపీ, కోరుట్ల బీజేపీ అభ్యర్థి ధర్మపురి అర్వింద్. నిజామాబాద్ నియోజకవర్గంలో బీడీ కార్మికుల కోసం 500 పడకల ఆసుపత్రిని నిర్మిస్తామని హామీ ఇచ్చారు. అడగకముందే కేంద్రహోంశాఖ మంత్రి అమిత్ షా రూ.200 కోట్లతో పసుపు పరిశోధన కేంద్రం మంజూరు చేశారని చెప్పారు. రూ.500 కోట్లతో ప్రత్యేక బోర్డు ఏర్పాటు చేస్తానని చెప్పి.. సీఎం కేసీఆర్ మోసం చేశారని అన్నారు. జగిత్యాల జిల్లా కోరుట్ల నియోజకవర్గం మెట్పల్లి పట్టణంలోని బోయవాడలో ఏర్పాటు చేసిన కార్నర్ మీటింగ్ లో ధర్మపురి అర్వింద్ మాట్లాడారు.

MP Arvind | కారు, కాంగ్రెస్‌, నోటాలో ఎవరికి ఓటు వేసినా నేనే గెలుస్తా..  బీజేపీ ఎంపీ అర్వింద్‌ సంచలన వ్యాఖ్యలు!-Namasthe Telangana

కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే కేసీఆర్ కంటే ఎక్కువగా భూములను రేవంత్ అమ్ముతారని చెప్పారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యే కవిత బిజినెస్ పార్ట్ నర్ రేవంత్ రెడ్డి అని ఆరోపించారు. ఇకపై జీవితంలో ఎన్నడూ కవిత ఎన్నికల్లో నిలబడదని, నిలబడినా గెలవదని చెప్పారు. రేవంత్ రెడ్డిని కేసీఆర్ జైలుకు ఎందుకు పంపడం లేదని ప్రశ్నించారు. నిజాం షుగర్ ఫ్యాక్టరీ కొంప ముంచింది కాంగ్రెస్ పార్టీనే అని… ఈ ఫ్యాక్టరీ ఓపెన్ కావాలంటే తెలంగాణలో బీజేపీ గెలవాలని చెప్పారు. కర్ణాటక ప్రజలను కాంగ్రెస్ మోసం చేసిందని విమర్శించారు.