రెండు రోజుల క్రితమే బీజేపీలో ఉన్న కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మళ్ళీ తిరిగి సొంతగూటికి చేరుకున్నారు. ఈయనకు బీజేపీలో అడిగిన విధంగా సీటును కేటాయించకపోవడం వలనే బయటకు వచేయునట్లు తెలుస్తోంది. కానీ వాస్తవంగా ఏమి జరిగింది అన్న విషయం గురించి బీజేపీ ఎంపీ అరవింద్ తెలియచేశారు. ఈయన కోమటిరెడ్డి రాజీనామా పై స్పందిస్తూ కీలక విషయాన్ని చెప్పారు.. రాజగోపాల్ రెడ్డి తనవారి కోసం మూడు ఎమ్మెల్యే సీట్లు కావాలని అడిగారట.. కానీ బీజేపీ నియమ నిబంధనల ప్రకారం ఇలా జరగదని తెలిసిందే. అందుకే పార్టీనే ఆయన్ని బయటకు పంపెసిందంటూ అసలు నిజాన్ని తెలియచేశారు. ఇక తెలంగాణ ఎన్నికల గురించి మాట్లాడుతూ ఈసారి కేసీఆర్ ఖచ్చితంగా ఓడిపోతారంటూ ధీమాను వ్యక్తం చేశారు.
అదే విధంగా BRS తరపున కవిత ప్రచారం చేస్తే బీజేపీకి చాలా మంచిదంటూ ఎంపీ అరవింద్ తెలియచేశారు. కాగా నవంబర్ 30న జరగనున్న ఎన్నికల్లో ఏ పార్టీ గెలుస్తుందా అన్నది చెప్పడం చాలా కష్టంగా మారింది.