డీఎంకే ఎంపీ కనిమొళికి ఆదివారం ఢిల్లీ విమానాశ్రయంలో చేదు అనుభవం ఎదురైంది. తాను భారతీయురాలినా, కాదా…? అని ఓ సీఐఎస్ఎఫ్ అధికారి తనను ప్రశ్నించినట్లు ఆమె వెల్లడించారు. తనకు హిందీ రాదని, తమిళం లేదా అంగ్ల భాషలో మాట్లాడమని అభ్యర్థించగా ఆ మహిళా అధికారి తనను ఈ ప్రశ్న అడిగినట్టు తెలిపారు.
నాకు హిందీ రాకపోవడం వల్ల తమిళం, ఆంగ్లంలో మట్లాడమని కోరానాని తెలిపారు. అందుకు ఆ అధికారి అసలు ‘మీరు భారతీయురాలేనా..?’ అని నన్ను ప్రశ్నించారని తెలిపింది. భారతీయత అంటే హిందీ తెలిసి ఉండడం అని ఎప్పటి నుంచి పరిగణిస్తున్నారో తెలుసుకోవాలని ఉందని డీఎంకే నేత కనిమొళి అన్నారు. హిందీని బలవంతంగా రుద్దుతున్నారనే అర్థం వచ్చే హ్యాష్ ట్యాగ్ తో ట్విట్టర్ లో పోస్ట్ చేశారు కనిమొళి. ఇక ఈ ట్వీట్ పై కేంద్ర పారిశ్రామిక భద్రతా దళం స్పందించింది. కనిమొనిళికి ఎదురైన చేదు అనుభవానికి చింతిస్తూ… ఈ ఘటనకు సంబంధించిన వివరాలను తెలపాలని భద్రతా దళం కోరింది.
Today at the airport a CISF officer asked me if “I am an Indian” when I asked her to speak to me in tamil or English as I did not know Hindi. I would like to know from when being indian is equal to knowing Hindi.#hindiimposition
— Kanimozhi (கனிமொழி) (@KanimozhiDMK) August 9, 2020